Tennis Tournament: ప్రీక్వార్టర్స్‌లో సబలెంక, స్వియటెక్
ABN , Publish Date - May 31 , 2025 | 02:52 AM
ఫ్రెంచ్ ఓపెన్‌లో టాప్ సీడ్ సబలెంక 6-2, 6-3తో డానిలోవిచ్‌ను ఓడించి, స్వియటెక్ 6-2, 7-5తో క్రిస్టియన్‌ని జయించి నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ జోడీ 7వ సీడ్‌ను ఓడించి సంచలనం సృష్టించింది.
ఫ్రెంచ్ ఓపెన్
పారిస్: టాప్ సీడ్ సబలెంక, డిఫెండింగ్ చాంపియన్ స్వియటెక్ ఫ్రెంచ్ ఓపెన్ నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు. శుక్రవారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్‌లో సబలెంక 6-2, 6-3తో డానిలోవిచ్‌ను చిత్తు చేసింది. ఇక స్వియటెక్ 6-2, 7-5తో క్రిస్టియన్‌ని ఓడించింది. నాలుగో సీడ్ పోలిని 6-4, 6-1తో యులియాపై, ఎనిమిదో సీడ్ జెంగ్ 6-3, 6-4 విక్టోరియాపై, రిబకినా 6-2, 6-2తో ఓస్టాపెంకోపై నెగ్గి నాలుగోరౌండ్‌కు చేరారు. పురుషుల సింగిల్స్‌లో ముసేటి, రూన్, టామీ పాల్ ముందంజ వేశారు.
ఏడో సీడ్‌కు భాంబ్రీ జోడీ షాక్: పురుషుల డబుల్స్‌లో యుకీ భాంబ్రీ ద్వయం సంచలనం సృష్టించింది. హోరాహోరీగా సాగిన రెండో రౌండ్‌లో భాంబ్రీ/రాబర్ట్ గాలోవే (అమెరికా) జోడీ 6-7(4), 7-6 (7), 6-3తో ఏడో సీడ్ నొకోలా మెక్టిక్ (క్రొయేషియా)/మైకేల్ వీనస్ (న్యూజిలాండ్) జంటని ఓడించి ముందంజ వేసింది.