Share News

French Open 2025: ప్రీక్వార్టర్స్‌కు సినర్‌, గాఫ్‌

ABN , Publish Date - Jun 01 , 2025 | 01:59 AM

ఫ్రెంచ్ ఓపెన్‌లో సీడెడ్ ఆటగాళ్ల దూకుడు కొనసాగుతోంది. అల్కారజ్‌, జ్వెరెవ్‌, ఆండ్రీవా, పెగులా తదితరులు ప్రీక్వార్టర్‌ ఫైనల్స్‌ చేరారు.

French Open 2025: ప్రీక్వార్టర్స్‌కు సినర్‌, గాఫ్‌

  • అల్కారజ్‌, జ్వెరెవ్‌, ఆండ్రీవా, పెగులా కూడా

పారిస్‌: ఫ్రెంచ్‌ ఓపెన్‌లో పురుషులు, మహిళల విభాగాల్లో సీడెడ్ల పయనం సాఫీగా సాగుతోంది. పురుషుల టాప్‌సీడ్‌ సినర్‌, రెండోసీడ్‌ అల్కారజ్‌, మూడోసీడ్‌ జ్వెరెవ్‌, ఐదోసీడ్‌ డ్రేపర్‌, మహిళల రెండోసీడ్‌ కొకొ గాఫ్‌, మూడోసీడ్‌ పెగులా, ఆరోసీడ్‌ మిర్రా ఆండ్రీవా ప్రీక్వార్టర్‌ఫైనల్లో ప్రవేశించారు. శనివారం జరిగిన సింగిల్స్‌ మూడో రౌండ్‌లో సినర్‌ 6-0, 6-1, 6-2తో లెహకాపై, జ్వెరెవ్‌ 6-2, 7-6 (4), 6-1తో కొబోలీపై, డ్రేపర్‌ 6-2, 6-4, 6-2తో ఫొనెస్కాపై, అల్కారజ్‌ 6-1, 6-3, 4-6, 6-4తో జుముర్‌పై నెగ్గారు. మహిళల సింగిల్స్‌లో గాఫ్‌ 6-1, 7-6(3)తో బౌస్కోవాను, పెగులా 3-6 6-4, 6-2తో వోండ్రొసోవాని, ఆండ్రీవా 6-3, 6-1తో పుటింట్సేవాని ఓడించారు. 10వ సీడ్‌ బడౌసాకు 6-1, 7-5తో 17వ సీడ్‌ కసట్కినా షాకిచ్చింది.

బాలాజీ జోడీ అవుట్‌: పురుషుల డబుల్స్‌ రెండో రౌండ్‌లో శ్రీరామ్‌ బాలాజీ/మిగ్వెల్‌ రేయస్‌ (కెనడా) ద్వయం 3-6, 4-6తో ఇటలీ జంట సిమోన్‌/ఆండ్రియా చేతిలో ఓటమితో టోర్నీ నుంచి నిష్క్రమించింది.

Updated Date - Jun 01 , 2025 | 02:00 AM