Dhammika Ranatunga Arrest: అర్జున రణతుంగ సోదరుడి అరెస్ట్
ABN , Publish Date - Dec 16 , 2025 | 05:52 AM
శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్న, మాజీ క్రికెటర్ ధమ్మిక రణతుంగను ఆ దేశ అవినీతి నిరోధక కమిషన్ సోమవారం అరెస్ట్ చేసింది. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడ,..
కొలంబో: శ్రీలంక మాజీ కెప్టెన్ అర్జున రణతుంగ అన్న, మాజీ క్రికెటర్ ధమ్మిక రణతుంగను ఆ దేశ అవినీతి నిరోధక కమిషన్ సోమవారం అరెస్ట్ చేసింది. అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. మాజీ టెస్ట్ క్రికెటర్ అయిన ఽ63 ఏళ్ల దమ్మిక 2017లో ప్రభుత్వ అధీనంలోని సిలోన్ పెట్రోలియం కార్పొరేషన్ (సీపీసీ) చైర్మన్‌గా ఉన్నాడు. ఆ సమయంలో క్రూడ్ ఆయిల్ కొనుగోళ్ల టెండర్లలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. ఈ కేసులో రెండో నిందితుడైన అర్జున రణతుంగ విదేశాల్లో ఉండడంతో ఆయనను అరెస్ట్ చేయలేకపోయినట్టు కమిషన్ తెలిపింది. ధమ్మిక సీపీసీ చైర్మన్‌గా ఉన్నప్పుడు అర్జున రణతుంగ దేశ పెట్రోలియం, పరిశ్రమల శాఖ మంత్రిగా వ్యవహరించారు.
ఇవి కూడా చదవండి:
ఆ ఒక్క రోజు నేనలా చేయకపోయుంటే!.. గబ్బర్ కీలక వ్యాఖ్యలు
వాళ్లిద్దరికీ ఆ సత్తా ఉంది.. సూర్య, గిల్‌కు అభిషేక్ శర్మ మద్దతు