Share News

India vs England Manchester Test: బజ్‌బాల్‌ షో

ABN , Publish Date - Jul 25 , 2025 | 02:13 AM

ఐదు టెస్టుల సిరీ్‌సలో తొలిసారిగా ఇంగ్లండ్‌ తమ బజ్‌బాల్‌ ఆటను రుచి చూపించింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఓపెనర్లు డకెట్‌ (100 బంతుల్లో 13 ఫోర్లతో 94), క్రాలే (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) వన్డే తరహాలో...

India vs England Manchester Test: బజ్‌బాల్‌ షో

  • ఇంగ్లండ్‌ మొదటి ఇన్నింగ్స్‌ 225/2

  • చెలరేగిన ఓపెనర్లు డకెట్‌, క్రాలే

  • భారత్‌ తొలి ఇన్నింగ్స్‌ 358

  • స్టోక్స్‌కు ఐదు వికెట్లు జూ నాలుగో టెస్టు

మాంచెస్టర్‌: ఐదు టెస్టుల సిరీ్‌సలో తొలిసారిగా ఇంగ్లండ్‌ తమ బజ్‌బాల్‌ ఆటను రుచి చూపించింది. బౌలింగ్‌కు సహకరిస్తున్న పిచ్‌పై ఓపెనర్లు డకెట్‌ (100 బంతుల్లో 13 ఫోర్లతో 94), క్రాలే (113 బంతుల్లో 13 ఫోర్లు, సిక్స్‌తో 84) వన్డే తరహాలో చెలరేగారు. దీంతో దాదాపు ఐదు పరుగుల రన్‌రేట్‌తో ఆతిథ్య జట్టు స్కోరు దూసుకెళ్లింది. ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగిన ఇంగ్లండ్‌.. గురువారం రెండో రోజు ఆట ముగిసే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 46 ఓవర్లలో 225/2 స్కోరు సాధించింది. జడేజా, అన్షుల్‌కు ఒ క్కో వికెట్‌ దక్కింది. ప్రస్తుతం 133 పరుగులు వెనుకబడి ఉండగా క్రీజులో పోప్‌ (20 బ్యాటింగ్‌), రూట్‌ (11 బ్యాటింగ్‌) ఉన్నారు. అంతకుముందు భారత్‌ తొ లి ఇన్నింగ్స్‌లో 358 పరుగులు చేసింది. పంత్‌ (54), శార్దూల్‌ (41), సుందర్‌ (27) రాణించారు. స్టోక్స్‌కు ఐదు, ఆర్చర్‌కు మూడు వికెట్లు దక్కాయి.

చెలరేగిన స్టోక్స్‌, ఆర్చర్‌: రెండో రోజు ఆటలో ఇంగ్లండ్‌ కెప్టెన్‌ స్టోక్స్‌ ఐదు వికెట్లకు తోడు ఆర్చర్‌ చెలరేగి భారత్‌ను ఎక్కువ సేపు క్రీజులో నిలువనీయలేదు. దీంతో 264/4 ఓవర్‌నైట్‌ స్కోరుతో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన భారత్‌ మరో 94 పరుగులకు మిగిలిన ఆరు వికెట్లను కోల్పోయింది. తొలి సెషన్‌ రెండో ఓవర్‌లోనే జడేజా (20)ను ఆర్చర్‌ వెనక్కి పంపినా.. శార్దూల్‌కు సుందర్‌ సహకరించాడు. అయితే ఓ ఊరించే బంతికి శార్దూల్‌ను స్టోక్స్‌ అవుట్‌ చేయడంతో ఆరో వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. కాసేపటికే వర్షం కారణంగా ముందుగానే లంచ్‌ బ్రేక్‌కు వెళ్లారు. విరామం తర్వాత సుందర్‌, అన్షుల్‌ వికెట్లను ఒకే ఓవర్‌లో పడగొట్టిన స్టోక్స్‌ ఎనిమిదేళ్ల తర్వాత ఐదు వికెట్ల ఫీట్‌ను సాధించాడు. అటు పంత్‌.. ఆర్చర్‌ అద్భుత బంతికి బౌల్డయి తన పోరాటాన్ని ముగించాడు. కాసేపటికే బుమ్రా (4)ను సైతం ఆర్చర్‌ అవుట్‌ చేసి భారత్‌ ఇన్నింగ్స్‌కు తెరదించా డు. 21 పరుగుల వ్యవధిలోనే గిల్‌ సేన చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది.


ఓపెనర్ల జోరు: రెండో సెషన్‌ మధ్యలో తొలి ఇన్నింగ్స్‌ ఆరంభించిన ఇంగ్లండ్‌ దూకుడే లక్ష్యంగా ముందుకు సాగిం ది. ఓపెనర్లు డకెట్‌, క్రాలే ధాటికి భారత పేస్‌ త్రయం బుమ్రా, అన్షుల్‌, సిరాజ్‌ ప్రభావం చూపలేదు. దీంతో టీ బ్రేక్‌ సమయానికి 14 ఓవర్లలోనే 77 పరుగులు సాధించింది. డకెట్‌కు తోడు..అటు ఆరంభంలో తడబడిన క్రాలే కూడా లయ అందుకోవడంతో వికెట్‌ కోల్పోకుండానే ఆతిథ్య జట్టు ఈ సెషన్‌ను ముగించింది. ఇక ఆఖరి సెషన్‌లో ఏకంగా 148 పరుగులు చేరాయి. జడేజా తొలి ఓవర్‌లోనే క్రాలే 6,4తో 15 రన్స్‌ రాబట్టాడు. ఇలా ఇద్దరూ అలవోకగా బౌండరీలు బాదేయడంతో 29వ ఓవర్‌లోనే స్కోరు 150 దా టింది. అయితే భారత్‌ ఎదురుచూపులకు జడేజా తెరదిం చుతూ 32వ ఓవర్‌లో క్రాలేను అవుట్‌ చేశాడు. అప్పటికే తొలి వికెట్‌కు 166 పరుగులు జత చేరడం విశేషం. ఆ తర్వాత శతకానికి అతి చేరువలో ఉన్న డకెట్‌ను అరంగేట్ర పేసర్‌ అన్షుల్‌ అవుట్‌ చేశాడు. అయితే పోప్‌, రూట్‌ జాగ్రత్తగా ఆడుతూ వికెట్‌ను కోల్పోకుండా ఆటను ముగించారు.

స్కోరు బోర్డు

భారత్‌ తొలి ఇన్నింగ్స్‌: జైస్వాల్‌ (సి) బ్రూక్‌ (బి) డాసన్‌ 58; రాహుల్‌ (సి) క్రాలే (బి) వోక్స్‌ 46; సాయి సుదర్శన్‌ (సి) కార్స్‌ (బి) స్టోక్స్‌ 61; గిల్‌ (ఎల్బీ) స్టోక్స్‌ 12; పంత్‌ (బి) ఆర్చర్‌ 54; జడేజా (సి) బ్రూక్‌ (బి) ఆర్చర్‌ 20; శార్దూల్‌ (సి) డకెట్‌ (బి) స్టోక్స్‌ 41; సుందర్‌ (సి) వోక్స్‌ (బి) స్టోక్స్‌ 27; అన్షుల్‌ (సి) స్మిత్‌ (బి) స్టోక్స్‌ 0; బుమ్రా (సి) స్మిత్‌ (బి) ఆర్చర్‌ 4; సిరాజ్‌ (నాటౌట్‌) 5; ఎక్స్‌ట్రాలు: 30; మొత్తం: 114.1 ఓవర్లలో 358 ఆలౌట్‌. వికెట్ల పతనం: 1-94, 2-120, 3-140, 4-235, 5-266, 6-314, 7-337, 8-337, 9-349, 10-358. బౌలింగ్‌: వోక్స్‌ 23-5-66-1; ఆర్చర్‌ 26.1-3-73-3; కార్స్‌ 21-1-71-0; స్టోక్స్‌ 24-3-72-5; డాసన్‌ 15-1-45-1; రూట్‌ 5-0-19-0.


ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌: క్రాలే (సి) రాహుల్‌ (బి) జడేజా 84; డకెట్‌ (సి) జురెల్‌ (బి) అన్షుల్‌ 94; పోప్‌ (బ్యాటింగ్‌) 20; రూట్‌ (బ్యాటింగ్‌) 11; ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 46 ఓవర్లలో 225/2. వికెట్ల పతనం: 1-166, 2-197. బౌలింగ్‌: బుమ్రా 13-4-37- 0; అన్షుల్‌ 10-1-48-1; సిరాజ్‌ 10-0-58-0; శార్దూల్‌ 5-0-35-0; జడేజా 8-0-37-1.

3-sports.jpg1

భారత్‌ తరఫున టెస్టుల్లో ఎక్కువ సిక్సర్లు (90) బాదిన బ్యాటర్‌గా సెహ్వాగ్‌తో సమంగా నిలిచిన పంత్‌. అలాగే ఒకే సిరీస్‌లో ఎక్కువ (5) 50+ స్కోర్లు సాధించిన భారత కీపర్‌గా పంత్‌.

పంత్‌.. ఓ యోధుడిలా!

రెండో రోజు తొలి సెషన్‌లో శార్దూల్‌ వికెట్‌ పడగానే క్రీజులోకి వస్తున్నదెవరో చూసి ప్రేక్షకులు ఒకింత షాక్‌కు గురయ్యారు. బుధవారం వోక్స్‌ ఓవర్‌లో కుడి పాదానికి గాయమై నడువలేని స్థితిలో పంత్‌ మైదానం వీడిన సంగతి తెలిసిందే. కాలికి ఫ్రాక్చరైన తను తిరిగి బ్యాటింగ్‌ చేస్తాడని బహుశా ఎవరూ ఊహించలేదేమో. కానీ శార్దూల్‌ అవుటయ్యాక మరే స్పెషలిస్ట్‌ బ్యాటర్‌ లేకపోవడంతో పంత్‌.. కుంటుతూనే బ్యాట్‌ చేతపట్టి క్రీజులోకి అడుగుపెట్టాడు. అయితే స్టోక్స్‌తో పాటు ఆర్చర్‌ అతడి పాదాన్ని లక్ష్యంగా చేస్తూ బంతులు విసిరి ఇబ్బందిపెట్టారు. అయినా కాలి నొప్పితోనే తను సింగిల్స్‌ తీయగా, చెత్త బంతులను బౌండరీలుగా మలుస్తూ హాఫ్‌ సెంచరీ సాధించడం విశేషం. మరోవైపు పంత్‌ చివరి టెస్టు ఆడేది సందేహమే కాబట్టి తమిళనాడు కీపర్‌ ఎన్‌.జగదీషన్‌ను ఇంగ్లండ్‌కు రప్పించనున్నారు.

ఇవీ చదవండి:

క్రికెట్‌కు రస్సెల్‌ గుడ్‌బై

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 25 , 2025 | 02:13 AM