ఇంగ్లండ్ లయన్స్ 527 7
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:15 AM
ఇండియా ‘ఎ’తో నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్ దీటైన బదులిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 237/2తో ఆదివారం, మూడోరోజు...
కాంటర్‌బరీ: ఇండియా ‘ఎ’తో నాలుగు రోజుల అనధికార టెస్ట్‌లో ఇంగ్లండ్ లయన్స్ దీటైన బదులిస్తోంది. ఓవర్‌నైట్ స్కోరు 237/2తో ఆదివారం, మూడోరోజు మొదటి ఇన్నింగ్స్ కొనసాగించిన లయన్స్ ఆట ఆఖరికి 7 వికెట్లకు 527 రన్స్ చేసింది. హెయిన్స్ (171), హోల్డెన్ (101), డాన్ మోస్లే (113) శతకాలు సాధించారు. ముకేశ్ 3 వికెట్లు తీశాడు. ఇండియా ‘ఎ’ తొలి ఇన్నింగ్స్‌లో 557 రన్స్ చేసిన సంగతి తెలిసిందే.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి