Share News

మితిమీరిన ప్రశంసలే సమస్య

ABN , Publish Date - May 01 , 2025 | 05:24 AM

14 ఏళ్ల క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మీడియా అతిగా దృష్టి సారించడం మంచిది కాదని రాజస్థాన్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హితవు పలికాడు...

మితిమీరిన ప్రశంసలే సమస్య

  • వైభవ్‌ స్టార్‌డమ్‌పై ద్రవిడ్‌

న్యూఢిల్లీ: 14 ఏళ్ల క్రికెట్‌ సంచలనం వైభవ్‌ సూర్యవంశీపై మీడియా అతిగా దృష్టి సారించడం మంచిది కాదని రాజస్థాన్‌ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ హితవు పలికాడు. ఒక ఇన్నింగ్స్‌తో తనకు వచ్చిన స్టార్‌డమ్‌ను తట్టుకొనేందుకు అతడు మార్గాలు కనుగొనాల్సి ఉంటుందన్నాడు. క్రికెట్‌ ప్రపంచమూ ఇకపై వైభవ్‌ను విస్మరించే పరిస్థితి ఉండదని ద్రవిడ్‌ స్పష్టంజేశాడు. కాగా భయం లేకుండా బ్యాటింగ్‌ చేయడమే వైభవ్‌ ప్రత్యేకతని అతడు ప్రశంసించాడు. ఆ వయస్సులో అలా ఆడే ఆటగాడిని చూడలేమని అన్నాడు. ‘బ్యాట్‌ను వేగంగా కదపడమే అతడి పవర్‌. సూర్యవంశీ బ్యాక్‌లిఫ్ట్‌, చేతికి, కంటికి మధ్య సమన్వయం అమోఘం’ అని విశ్లేషించాడు.

ఇవి కూడా చదవండి..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 01 , 2025 | 05:25 AM