Share News

దేశాన్నే కాదు.. గేమ్‌ను కూడా తీసుకెళ్లలేరు

ABN , Publish Date - Feb 23 , 2025 | 03:54 AM

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ తమ పొరుగు దేశమైన కెనడాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కెనడాను...

దేశాన్నే కాదు..  గేమ్‌ను కూడా తీసుకెళ్లలేరు

ట్రంప్‌నకు కెనడా ప్రధాని చురకలు

బోస్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి డొనాల్డ్‌ ట్రంప్‌ తమ పొరుగు దేశమైన కెనడాతో కయ్యానికి కాలు దువ్వుతున్నారు. కెనడాను త్వరలోనే అమెరికాకు 51వ రాష్ట్రంగా కలుపుకొంటానంటూ ట్రంప్‌ ఇటీవల రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బోస్టన్‌లో జరిగిన ఐస్‌ హాకీ టోర్నీ నాలుగు దేశాల పేస్‌ ఆఫ్‌ ఫైనల్లో అమెరికాను 3-2తో ఓడించి కెనడా విజేతగా నిలవడంతో ఆ దేశ ప్రధాని టూడో ఘనంగా సంబరాలు చేసుకున్నారు. అంతేకాదు.. ‘మా దేశాన్ని తీసుకెళ్లలేరు.. అలాగే మా గేమ్‌ను కూడా తీసుకెళ్లలేరు’ అని ట్రంప్‌కు చురకలంటిస్తూ ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు. ఫైనల్‌ మ్యాచ్‌కు ముందు ట్రంప్‌ తమ జట్టును ఉద్దేశిస్తూ ‘మన 51వ రాష్ట్రంగా మారే కెనడాపై గ్రేట్‌ అమెరికా విజయం సాధిస్తుందని విశ్వసిస్తున్నా’ అని పోస్ట్‌ చేశారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2025 | 03:54 AM