Share News

25 వేటలో జొకో

ABN , Publish Date - May 25 , 2025 | 05:17 AM

క్లేకోర్ట్‌ రారాజు రఫెల్‌ నడాల్‌ రిటైర్మెంట్‌ తర్వాత జరుగుతున్న తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో యువ హవా నడవనుంది. డిఫెండింగ్‌ చాంప్‌ కార్లోస్‌ అల్కరజ్‌, జానిక్‌ సిన్నర్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి..

25 వేటలో జొకో

సోనీ లివ్‌లో మ. 2.30 నుంచి

  • నేటి నుంచి ఫ్రెంచ్‌ ఓపెన్‌

  • ఫేవరెట్లుగా అల్కారజ్‌, సిన్నర్‌

పారిస్‌: క్లేకోర్ట్‌ రారాజు రఫెల్‌ నడాల్‌ రిటైర్మెంట్‌ తర్వాత జరుగుతున్న తొలి ఫ్రెంచ్‌ ఓపెన్‌లో యువ హవా నడవనుంది. డిఫెండింగ్‌ చాంప్‌ కార్లోస్‌ అల్కరజ్‌, జానిక్‌ సిన్నర్‌ మధ్యే ప్రధాన పోటీ ఉంటుందనే అంచనాలున్నాయి. ఆదివారం నుంచి జరిగే టోర్నీలో సిన్నర్‌ టాప్‌ సీడ్‌గా బరిలోకి దిగుతున్నాడు. ఇక, రికార్డు స్థాయిలో 25వ గ్రాండ్‌స్లామ్‌ వేటలో ఉన్న సెర్బియా యోధుడు నొవాక్‌ జొకోవిచ్‌.. రోలాండ్‌ గారో్‌సలోనే ఆ ఫీట్‌ పూర్తిచేయాలనుకొంటున్నాడు. అయితే, ఆరోసీడ్‌ జొకోవిచ్‌, సిన్నర్‌ ఒకే పార్శ్వంలో ఉండడంతో సెమీస్‌లో ఇద్దరూ తలపడే చాన్సుంది. తొలి రౌండ్‌లో మెకెంజీతో జొకో, ఆర్థర్‌ (ఫ్రాన్స్‌)తో సిన్నర్‌ తలపడనున్నారు. క్వాలిఫయర్‌ జిప్పరీ (ఇటలీ)తో అల్కారజ్‌ ఆడనున్నాడు. మహిళల సింగిల్స్‌లో టాప్‌ సీడ్‌ సబలెంక ఫేవరెట్‌ కాగా... మూడుసార్లు డిఫెండింగ్‌ చాంప్‌ స్వియటెక్‌, గతేడాది రన్నరప్‌ పౌలినీ, రెండో సీడ్‌ కొకో గాఫ్‌ టైటిల్‌ రేసులో ఉన్నారు.

ఇవీ చదవండి:

గిల్‌కు బీసీసీఐ ప్రమోషన్

ఫైనల్ టెన్షన్.. ఆర్సీబీ ఎన్ని గెలవాలంటే..

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 25 , 2025 | 05:17 AM