Dilbagh Singh Wins Silver: దిల్బగ్ సింగ్‌కు రజతం
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:39 AM
కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు శుక్రవారం మరో రెండు పతకాలు లభించాయి...
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌ప
అహ్మదాబాద్: కామన్వెల్త్ వెయిట్‌లిఫ్టింగ్ చాంపియన్‌షి్‌పలో భారత్‌కు శుక్రవారం మరో రెండు పతకాలు లభించాయి. పురుషుల 94 కేజీల విభాగంలో దిల్బగ్ సింగ్ రజతం సాధించాడు. స్నాచ్‌లో 153 కేజీలు, క్లీన్ అండ్ జెర్క్‌లో 189 కేజీల బరువు ఎత్తిన దిల్బగ్ (342 కేజీలు) కేవలం ఒక్క కేజీ తేడాతో ప్రత్యర్థి మొహమ్మద్ సైమీ (మలేసియా, 343 కేజీలు)కి స్వర్ణం కోల్పోయాడు. అలాగే మహిళల 86 కేజీల విభాగంలో వన్షిత వర్మ కాంస్యం సాధించింది. స్నాచ్‌లో 95 కేజీలు ఎత్తిన ఆమె.. క్లీన్ అండ్ జెర్క్‌లో 127 కేజీల బరువు ఎత్తింది. మొత్తంగా టోర్నీలో భారత్ ఖాతాలో ఏడు పతకాలు చేరాయి. 31 దేశాల నుంచి 300 మంది లిఫ్టర్లు పాల్గొంటున్న ఈ టోర్నీ శనివారంతో ముగియనుంది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..