Deaf Olympics 2025: దీక్ష స్వర్ణ చరిత్ర
ABN , Publish Date - Nov 21 , 2025 | 02:29 AM
బధిర ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ దీక్షా డాగర్ చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే ఫైనల్ రౌండ్‌లో 24 ఏళ్ల దీక్ష అద్భుత ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకుంది...
మహిత్‌కు రజతం.. బధిర ఒలింపిక్స్
టోక్యో : బధిర ఒలింపిక్స్‌లో భారత గోల్ఫర్ దీక్షా డాగర్ చరిత్ర సృష్టించింది. గురువారం జరిగిన మహిళల వ్యక్తిగత స్ట్రోక్‌ప్లే ఫైనల్ రౌండ్‌లో 24 ఏళ్ల దీక్ష అద్భుత ప్రదర్శనతో స్వర్ణం దక్కించుకుంది. 2021 బధిర ఒలింపిక్స్‌లో పసిడి పతకం సొంతం చేసుకున్న దీక్షా డాగర్ ఈసారి ఆ పతకాన్ని నిలబెట్టుకోవడం ద్వారా కొత్త చరిత్ర లిఖించింది. షూటింగ్ మహిళల 50 మీ. ప్రోన్ ఫైనల్లో మహిత్ సంధూ 246.1 పాయింట్లు స్కోరు చేసి రజత పతకం చేజిక్కించుకుంది. ఈ ఒలింపిక్స్‌లో మహిత్ సంధూకిది మూడో పతకం. క్వాలిఫికేషన్‌లో సంధూ ప్రపంచ రికార్డు సృష్టించింది.
ఇవి కూడా చదవండి:
చరిత్ర సృష్టించిన ముష్ఫికర్ రహీమ్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి