Dhanush Srikanth Strikes Double Gold: ధనుష్ డబుల్ ధమాకా
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:18 AM
తెలుగు షూటర్ ధనుష్ శ్రీకాంత్ తన గురి తప్పదని మరోసారి నిరూపించాడు. బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)లో రెండో స్వర్ణం కొల్లగొట్టి డబుల్ ధమాకా సృష్టించాడు. రెండ్రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్...
బధిర ఒలింపిక్స్‌లో రెండో స్వర్ణం కైవసం
టోక్యో: తెలుగు షూటర్ ధనుష్ శ్రీకాంత్ తన గురి తప్పదని మరోసారి నిరూపించాడు. బధిర ఒలింపిక్స్ (డెఫ్లింపిక్స్)లో రెండో స్వర్ణం కొల్లగొట్టి డబుల్ ధమాకా సృష్టించాడు. రెండ్రోజుల క్రితం 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత ఈవెంట్‌లో విజేతగా నిలిచిన ఈ హైదరాబాద్ స్టార్.. మంగళవారం మిక్స్‌డ్ విభాగంలోనూ పసిడి దక్కించుకున్నాడు. 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్ ఫైనల్లో భారత ద్వయం ధను్‌ష/మహిత్ సంధు 17-7తో దక్షిణ కొరియా జోడీ జియోన్ డెయిన్/కిమ్ వూరిమ్‌ను ఓడించి బంగారు పతకం అందుకుంది. ఇక, భారత్‌కే చెందిన మహ్మద్ ముర్తజా వానియా/కోమల్ మిలింద్ జంట 16-12తో ఉక్రెయిన్ ద్వయంపై గెలిచి కాంస్య పతకం సొంతం చేసుకుంది. 23 ఏళ్ల ధనుష్ శ్రీకాంత్‌కు ఇది ఓవరాల్‌గా నాలుగో డెఫ్లింపిక్స్ స్వర్ణం కావడం విశేషం. 2022లో బ్రెజిల్ వేదికగా జరిగిన టోర్నీలోనూ వ్యక్తిగత, మిక్స్‌డ్ ఈవెంట్లలో చాంపియన్‌గా నిలిచాడు. కొన్నాళ్లుగా అంతర్జాతీయస్థాయిలో అద్భుత విజయాలు సాధిస్తోన్న ధనుష్.. మాజీ షూటర్, ఒలింపిక్ కాంస్య పతక విజేత గగన్ నారంగ్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి