Delhi Capitals : ముంబై జోరుకు బ్రేక్
ABN , Publish Date - Mar 01 , 2025 | 02:14 AM
హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ మహిళల జట్టుకు బ్రేక్ పడింది. ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ..

రాణించిన లానింగ్, షఫాలీ
ఢిల్లీ ఘనవిజయం
మహిళల ప్రీమియర్ లీగ్
డబ్ల్యూపీఎల్‌లో నేడు
ఢిల్లీ గీ బెంగళూరు
రాత్రి 7.30 నుంచి స్టార్ స్పోర్ట్స్‌లో
బెంగళూరు: హ్యాట్రిక్ విజయాలతో దూసుకెళుతున్న ముంబై ఇండియన్స్ మహిళల జట్టుకు బ్రేక్ పడింది. ఆల్‌రౌండ్ షో కనబర్చిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు 9 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. మెగ్ లానింగ్ (60 నాటౌట్), షఫాలీ (43) మెరుపు ఇన్నింగ్స్‌తో చెలరేగారు. శుక్రవారం జరిగిన ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ముంబై 20 ఓవర్లలో 9 వికెట్లకు 123 పరుగులు చేసింది. కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (22), హేలీ మాథ్యూస్ (22) మాత్రమే రాణించారు. స్పిన్నర్లు మిన్ను మణి (3/17), జొనాస్సెన్ (3/25) ధాటికి 23 రన్స్ వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు నేలకూలాయి. ఆ తర్వాత స్వల్ప ఛేదనలో ఢిల్లీ 14.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 124 పరుగులు చేసి గెలిచింది. ఓపెనర్లు లానింగ్, షఫాలీ తుఫాన్ ఇన్నింగ్స్‌తో శుభారంభం అందించారు. నాలుగో ఓవర్‌లో 6,4,4తో 16 రన్స్ రాబట్టిన షఫాలీ.. తొమ్మిదో ఓవర్‌లో రెండు సిక్సర్లతో మరింత జోరు చూపింది. అయితే తొలి వికెట్‌కు 85 పరుగులు జత చేశాక అమన్‌జోత్‌కు చిక్కింది. ఆ తర్వాత లానింగ్ చెలరేగి అర్ధసెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు, మరో 33 బంతులుండగానే మ్యాచ్‌ను ముగించింది.
సంక్షిప్త స్కోర్లు: ముంబై ఇండియన్స్: 20 ఓవర్లలో 123/9 (హర్మన్‌ప్రీత్ 22, మాథ్యూస్ 22, బ్రంట్ 18, అమన్‌జోత్ 17 నాటౌట్; మిన్ను మణి 3/17జొనాసెన్ 3/25).
ఢిల్లీ క్యాపిటల్స్: 14.3 ఓవర్లలో 124/1 (మెగ్ లానింగ్ 60 నాటౌట్, షఫాలీ 43; అమన్‌జోత్ 1/12).