చెన్నై అవుట్
ABN , Publish Date - May 01 , 2025 | 05:32 AM
ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే) కథ ముగిసింది. ఎనిమిదో ఓటమితో ధోనీ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకిన పంజాబ్ కింగ్స్...
నేటి మ్యాచ్
రాజస్థాన్ X ముంబై
వేదిక : జైపూర్, రా.7.30 నుంచి
4 వికెట్లతో పంజాబ్ గెలుపు
శ్రేయాస్, ప్రభ్‌సిమ్రన్ అర్ధ శతకాలు
చాహల్ హ్యాట్రిక్
చెన్నై: ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎ్‌సకే) కథ ముగిసింది. ఎనిమిదో ఓటమితో ధోనీ సేన ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్క్రమించగా.. 13 పాయింట్లతో రెండో స్థానానికి ఎగబాకిన పంజాబ్ కింగ్స్ నాకౌట్‌కు చేరువైంది. యజ్వేంద్ర చాహల్ (3-0-32-4) హ్యాట్రిక్‌కు శ్రేయాస్ అయ్యర్ (41 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్స్‌లతో 72) అదిరే అర్ధ శతకంతోడు కావడంతో.. బుధవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్ 4 వికెట్ల తేడాతో చెన్నైను చిత్తు చేసింది. తొలుత చెన్నై 19.2 ఓవర్లలో 190 పరుగులకు ఆలౌటైంది. సామ్ కర్రాన్ (88), బ్రేవిస్ (32) పోరాడారు. అర్ష్‌దీప్, జాన్సన్ చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఛేదనలో పంజాబ్ 19.4 ఓవర్లలో 194/6 స్కోరు చేసి నెగ్గింది. ప్రభ్‌సిమన్ర్ సింగ్ (54) రాణించాడు. పతిరన, ఖలీల్ చెరో 2 వికెట్లు తీశారు. శ్రేయాస్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు.
ఆరంభం నుంచే దూకుడు..: ఛేదనలో పంజాబ్‌కు ఓపెనర్లు ప్రియాన్ష్ ఆర్య (23), ప్రభ్‌సిమ్రన్ తొలి వికెట్‌కు 44 పరుగుల భాగస్వామ్యంతో దూకుడైన ఆరంభాన్నిచ్చారు. అయితే, ఐదో ఓవర్‌లో రెండు బౌండ్రీలు బాదిన ఆర్యను ఖలీల్ అవుట్ చేయడంతో.. ఆరు ఓవర్లకు పంజాబ్ 51/1తో నిలిచింది. మధ్య ఓవర్లలో ప్రభ్‌సిమ్రన్, కెప్టెన్ అయ్యర్ రన్‌రేట్ తగ్గకుండా స్కోరు బోర్డును నడిపించారు. అయితే, ప్రభ్‌ను నూర్ క్యాచవుట్ చేయడంతో.. రెండో వికెట్‌కు 72 పరుగుల పార్ట్‌నర్‌షి్‌పకు తెరపడింది. తర్వాత వధేరా (5)ను పతిరన పెవిలియన్ చేర్చాడు. చివరి 5 ఓవర్లలో పంజాబ్ విజయానికి 52 పరుగులు అవసరం కాగా.. అయ్యర్, శశాంక్ (23) 18 బంతుల్లో 44 పరుగులు జోడించడంతో.. పంజాబ్ మరో 2 బంతులు మిగిలుండగానే గెలిచింది. విజయానికి 3 పరుగుల దూరంలో ఉండగా.. అయ్యర్‌ను పతిరన క్లీన్‌బౌల్డ్ చేశాడు.
చాహల్ మాయాజాలం..: కర్రాన్ ముందుండి నడిపించడంతో చెన్నై భారీ స్కోరు చేసే విధంగా కనిపించినా.. చాహల్ హ్యాట్రిక్‌తో డెత్ ఓవర్లలో ఒక్కసారిగా కుదేలైంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన చెన్నైకు శుభారంభం దక్కలేదు. ఓపెనర్లు షేక్ రషీద్ (11), ఆయుష్ మాత్రే (7)తోపాటు జడేజా (17) విఫలం కావడంతో.. పవర్‌ప్లేలో 48/3తో మూడు టాపార్డర్ వికెట్లు కోల్పోయిన చెన్నై కష్టాల్లో పడింది. ఈ దశలో కర్రాన్, బ్రేవిస్ నాలుగో వికెట్‌కు 78 పరుగుల భాగస్వామ్యంతో ఆదుకొన్నారు. అయితే, జోరుగా సాగుతున్న వీరి భాగస్వామ్యాన్ని ఒమర్జాయ్ విడదీశాడు. 15వ ఓవర్‌లో బ్రేవి్‌సను ఒమర్జాయ్ బౌల్డ్ చేయగా.. సింగిల్‌తో ఫిఫ్టీ పూర్తి చేసుకొన్న కర్రాన్ ఆ తర్వాత మరింతగా చెలరేగాడు. 16వ ఓవర్‌లో కర్రాన్ ఏకంగా 26 పరుగులు పిండుకోవడంతో.. స్కోరు బోర్డు రాకెట్ వేగంతో దూసుకెళ్లింది. అయితే, 172 పరుగుల స్కోరు వద్ద కర్రాన్‌ను జాన్సెన్ అవుట్ చేయడంతో.. చెన్నై ఒక్కసారిగా కుప్పకూలింది. కేవలం 18 పరుగుల తేడాతో మిగతా ఐదు వికెట్లు చేజార్చుకొంది.
ఒకే ఓవర్‌లో 4 వికెట్లు..: అనూహ్యంగా 19వ ఓవర్‌లో బంతిని అందుకొన్న చాహల్.. తన మాయాజాలంతో సీఎ్‌సకేను డబుల్ సెంచరీ మార్క్ చేరకుండా దెబ్బకొట్టాడు. రెండో బంతికి ధోనీ (11) క్యాచవుట్ కాగా.. మూడో బంతికి దీపక్ హుడా (2) రెండు పరుగులు తీశాడు. కానీ, నాలుగో బంతికి హుడాను క్యాచవుట్ చేసిన చాహల్.. ఐదో బంతికి అన్షుల్ కాంబోజ్ (0)ను బౌల్డ్ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ఆరో బంతికి షాట్ ఆడేక్రమంలో నూర్ అహ్మద్ (0) అవుట్ కావడంతో.. చాహల్ సంబరాలు చేసుకొన్నాడు. శివం దూబే (6)ను పెవిలియన్ చేర్చిన అర్ష్‌దీప్ చెన్నై ఇన్నింగ్స్‌కు తెరదించాడు.
స్కోరుబోర్డు
చెన్నై: రషీద్ (సి) శశాంక్ (బి) అర్ష్‌దీప్ 11, ఆయుష్ (సి) శ్రేయాస్ (బి) జాన్సెన్ 7, సామ్ కర్రాన్ (సి) ఇంగ్లిస్ (బి) జాన్సెన్ 88, జడేజా (సి) ఇంగ్లిస్ (బి) హర్‌ప్రీత్ 17, బ్రేవిస్ (బి) అజ్మతుల్లా 32, దూబే (సి) శశాంక్ (బి) అర్ష్‌దీప్ 6, ధోనీ (సి) వధేరా (బి) చాహల్ 11, హుడా (సి) ప్రియాన్ష్ (బి) చాహల్ 2, అన్షుల్ (బి) చాహల్ 0, నూర్ (సి) జాన్సెన్ (బి) చాహల్ 0, ఖలీల్ (నాటౌట్) 0, ఎక్స్‌ట్రాలు: 16; మొత్తం: 19.2 ఓవర్లలో 190 ఆలౌట్: వికెట్ల పతనం: 1-21, 2-22, 3-48, 4-126, 5-172, 6-184, 7-186, 8-186, 9-186, 10-190; బౌలింగ్: అర్ష్‌దీప్ 3.2-0-25-2, జాన్సెన్ 4-0-30-2, అజ్మతుల్లా 4-0-39-1, హర్‌ప్రీత్ 2-0-21-1, చాహల్ 3-0-32-4, సూర్యాంశ్ 3-0-40-0.
పంజాబ్: ప్రియాన్ష్ (సి) ధోనీ (బి) ఖలీల్ 23, ప్రభ్‌సిమ్రన్ (సి) బ్రెవిస్ (బి) నూర్ 54, శ్రేయాస్ (బి) పతిరన 72, వధేరా (సి) జడేజా (బి) పతిరన 5, శశాంక్ (సి) బ్రెవిస్ (బి) జడేజా 23, ఇంగ్లిస్ (నాటౌట్) 6, సూర్యాంశ్ (సి) నూర్ (బి) ఖలీల్ 1, జాన్సెన్ (నాటౌట్) 4, ఎక్స్‌ట్రాలు: 6; మొత్తం: 19.4 ఓవర్లలో 194/6; వికెట్ల పతనం: 1-44, 2-116, 3-136, 4-180, 5-188, 6-190; బౌలింగ్: ఖలీల్ 3.4-0-28-2, అన్షుల్ 2-0-20-0, జడేజా 3-0-32-1, నూర్ అహ్మద్ 4-0-39-1, కర్రాన్ 3-0-27-0, పతిరన 4-0-45-2.
పాయింట్ల పట్టిక
జట్టు ఆ గె ఓ ఫ.తే పా నె.రరే
బెంగళూరు 10 7 3 0 14 0.521
పంజాబ్ 10 6 3 1 13 0.199
ముంబై 10 6 4 0 12 0.889
గుజరాత్ 9 6 3 0 12 0.748
ఢిల్లీ 10 6 4 0 12 0.362
లఖ్‌నవూ 10 5 5 0 10 -0.325
కోల్‌కతా 10 4 5 1 9 0.271
రాజస్థాన్ 10 3 7 0 6 -0.349
హైదరాబాద్ 9 3 6 0 6 -1.103
చెన్నై 10 2 8 0 4 -1.211
గమనిక: ఆ: ఆడినవి; గె: గెల్చినవి; ఓ: ఓడినవి;
ఫ.తే: ఫలితం తేలనివి; పా: పాయింట్లు; నె.రరే: నెట్ రన్‌రేట్
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి