Share News

8న రింకూ నిశ్చితార్థం

ABN , Publish Date - Jun 02 , 2025 | 03:38 AM

సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో క్రికెటర్‌ రింకూ సింగ్‌ నిశ్చితార్థం ఈ నెల 8న లఖ్‌నవూలో జరగనుంది. ప్రియ తండ్రి తుఫానీ సరోజ్‌ ఆదివారం ఈ విషయాన్ని...

8న రింకూ నిశ్చితార్థం

జాన్‌పూర్‌ (యూపీ): సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రియా సరోజ్‌తో క్రికెటర్‌ రింకూ సింగ్‌ నిశ్చితార్థం ఈ నెల 8న లఖ్‌నవూలో జరగనుంది. ప్రియ తండ్రి తుఫానీ సరోజ్‌ ఆదివారం ఈ విషయాన్ని వెల్లడించారు. నవంబరు 18న వారణాసిలోని తాజ్‌ హోటల్‌లో వీరి వివాహం జరుగుతుందన్నారు. ఈ వేడుకకు సన్నిహితులను మాత్రమే ఆహ్వానించినట్టు చెప్పారు. ప్రియ, రింకూలకు కొంతకాలంగా పరిచయం ఉందని.. ఇరు కుటుంబాల అంగీకారంతో పెళ్లిని ఫిక్స్‌ చేసినట్టు సరోజ్‌ తెలిపారు. 26ఏళ్ల ప్రియ ఉత్తరప్రదేశ్‌లోని మచిలీషహర్‌ నియోజవర్గం నుంచి తొలిసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. రింకూ అదే రాష్ట్రంలోని అలీగఢ్‌కు చెందినవాడు.

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 02 , 2025 | 03:38 AM