ముంబై X విదర్భ
ABN , Publish Date - Feb 17 , 2025 | 02:07 AM
డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. విదర్భ జట్ల మధ్య రంజీట్రోఫీ సెమీఫైనల్ సోమవారం ఇక్కడ ప్రారంభం కానుంది. యశస్వీ జైస్వాల్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలగినా...

గుజరాత్‌తోకేరళ ఢీ
నేటినుంచే రంజీ సెమీస్
ముంబై కెప్టెన్ రహానె
విదర్భ సారథి అక్షయ్
నాగ్‌పూర్:డిఫెండింగ్ చాంపియన్ ముంబై.. విదర్భ జట్ల మధ్య రంజీట్రోఫీ సెమీఫైనల్ సోమవారం ఇక్కడ ప్రారంభం కానుంది. యశస్వీ జైస్వాల్ గాయంతో మ్యాచ్ నుంచి వైదొలగినా ముంబై పటిష్టంగానే కనిపిస్తోంది. కెప్టెన్ రహానె, శివమ్ దూబే, శార్దూల్ ఠాకూర్ వంటి స్టార్లతో ఆ జట్టు కళకళలాడుతోంది. అయితే ఈ సీజన్‌లో ముంబై టాపార్డర్ కాకుండా లోయరార్డర్ బ్యాటర్లు భారీ స్కోర్లతో జట్టును ఆదుకుంటున్నారు. ఇక సెమీ్‌సలో టాపార్డర్ కూడా రాణిస్తే ముంబైకి తిరుగుండదు. మరోవైపు కరుణ్ నాయర్, కెప్టెన్ అక్షయ్‌తో కూడిన విదర్భ ఫ్రంట్‌లైన్ బ్యాటింగ్ విభాగం ఈ సీజన్‌లో పరుగుల వరద పారిస్తోంది. ఈనేపథ్యంలో సెమీస్ పోరు రసవత్తరంగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది. అహ్మదాబాద్‌లో జరిగే మరో సెమీఫైనల్లో గుజరాత్..కేరళతో తలపడనుంది.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..