Coco Gauff: గాఫ్ గర్జన
ABN , Publish Date - Aug 30 , 2025 | 03:45 AM
ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న అమెరికా యువ తార కొకొ గాఫ్.. సొంతగడ్డపై మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది...
మూడో రౌండ్‌కు అమెరికా స్టార్
సినర్, జ్వెరెవ్ కూడా
ప్రీక్వార్టర్స్‌కు రిబకినా
యూఎస్ ఓపెన్
న్యూయార్క్: ఈ ఏడాది ఫ్రెంచ్ ఓపెన్ నెగ్గి జోరుమీదున్న అమెరికా యువ తార కొకొ గాఫ్.. సొంతగడ్డపై మరో గ్రాండ్‌స్లామ్ టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. యూఎస్ ఓపెన్‌లో మూడో సీడ్‌గా బరిలోకి దిగిన గాఫ్ మూడో రౌండ్‌లోకి అడుగుపెట్టింది. క్రొయేషియాకు చెందిన వెకిక్‌తో జరిగిన రెండో రౌండ్ పోరులో గాఫ్ 7-6 (5), 6-2తో విజయం సాధించింది. వెకిక్‌తో మ్యాచ్ మధ్యలో, మ్యాచ్ ముగిశాక గాఫ్ తీవ్ర భావోద్వేగానికిగురై కంటతడి పెట్టుకుంది. తొలి సెట్ ముగింపు దశలో వరుసగా రెండుసార్లు డబుల్ ఫాల్ట్ చేసి సర్వీస్ చేజార్చుకున్న క్రమంలో టవల్ అడ్డం పెట్టుకొని ఏడ్చిన గాఫ్.. మ్యాచ్ ముగిశాక స్టాండ్స్‌లో అమెరికా జిమ్నాస్టిక్స్ స్టార్ సిమోన్ బైల్స్ గురించి మాట్లాడుతూ కన్నీటి పర్యంతమైంది. ‘ఎంతో ఒత్తిడిలోనూ ఆరు అంగుళాల బీమ్‌పై సిమోన్ అద్భుతమైన విన్యాసాలు చేస్తూ అందరినీ అబ్బురపరుస్తుంది. ఆమెలాగే జీవితంలో నేను కూడా మంచి, చెడు చూశా. అందుకే కోర్టులో రాకెట్ పట్టుకున్నప్పుడల్లా సిమోన్ స్ఫూర్తితో ముందుకెళుతుంటా’ అని గాఫ్ వ్యాఖ్యానించింది. 8వ సీడ్ అనిసిమోవా 7-6 (2), 6-2తో మయాపై, 15వ సీడ్ కసత్కినా 6-2, 4-6, 7-5తో రఖిమోవాపై, రెండుసార్లు విజేత ఒసాక 6-3, 6-1తో హీలీపై గెలిచి మూడోరౌండ్‌కు చేరారు.
టామీ పాల్ పోరు.. నాలుగున్నర గంటలు: పురుషుల సింగిల్స్‌లో 14వ సీడ్ టామీ పాల్ తన ప్రత్యర్థిని ఓడించేందుకు నాలుగున్నర గంటల పాటు పోరాడాడు. ఐదు సెట్లపాటు సాగిన ఈ పోరులో పాల్ 7-6(6), 6-3, 5-7, 5-7, 7-5తో నూనో బోర్గె్‌సను ఓడించి మూడో రౌండ్ చేరాడు. మరో రెండోరౌండ్ పోరులో యానిక్ సినర్ 6-3, 6-2, 6-2తో అలెక్సీ పాప్‌రిన్‌ను ఓడించాడు. మూడో సీడ్ జ్వెరెవ్ 6-4, 6-4, 6-4తో ఫెర్న్‌లీపై నెగ్గగా.. సిట్సిపాస్ రెండో రౌండ్లోనే ఇంటిబాట పట్టాడు.
వీనస్ 11 ఏళ్ల తర్వాత..
వెటరన్ స్టార్ వీనస్ విలియమ్స్ సింగిల్స్ తొలిరౌండ్లోనే నిష్క్రమించినా.. డబుల్స్‌లో మాత్రం శుభారంభం చేసింది. వీన్‌స/లైలా ఫెర్నాండెజ్ జోడీ 7-6(4), 6-3తో ఆరో సీడ్ లుడ్మెలా/ఎలెన్ పెరోజ్‌ను ఓడించింది. 45 ఏళ్ల వీనస్ యూఎస్ ఓపెన్‌లో డబుల్స్ మ్యాచ్ గెలవడం 2014 తర్వాత ఇదే మొదటిసారి.
రదుకాను ఇంటికి..
బ్రిటన్ బ్యూటీ ఎమ్మా రదుకానుకు యూఎస్ ఓపెన్‌లో చుక్కెదురైంది. 2021లో ఇక్కడ టైటిల్ నెగ్గి అందరినీ ఆకర్షించిన రదుకాను పోరాటం ఈసారి మూడో రౌండ్‌కే పరిమితమైంది. వింబుల్డన్ మాజీ చాంపియన్, 9వ సీడ్ ఎలెనా రిబకినా 6-1, 6-2తో రదుకానును చిత్తుచేసి ప్రీక్వార్టర్స్‌కు దూసుకెళ్లింది.
ఈ వార్తలు కూడా చదవండి:
Musi River Effect On Hyderabad: ఉగ్రరూపం దాల్చిన మూసీ.. నగరంలో పలుచోట్ల రాకపోకలు బంద్..
Rain Effect On Roads: భారీ వర్షాలతో 1039 కి.మీ మేర రోడ్లు ధ్వంసం..