England Pacer: క్రిస్ వోక్స్ రిటైర్మెంట్
ABN , Publish Date - Sep 30 , 2025 | 05:14 AM
ఇంగ్లండ్ పేసర్ , 36 ఏళ్ల క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్...
లండన్: ఇంగ్లండ్ పేసర్ , 36 ఏళ్ల క్రిస్ వోక్స్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ పలుకుతున్నట్టు ప్రకటించాడు. నవంబరులో జరిగే యాషెస్ సిరీస్ కోసం ప్రకటించిన ఇంగ్లండ్ జట్టులో వోక్స్‌కు చోటు దక్కలేదు. అతడి రిటైర్మెంట్‌కు ఇదే కారణమని సమాచారం. 2011లో అరంగేట్రం చేసిన వోక్స్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్నాడు. 62 టెస్టుల్లో 2034 పరుగులు, 192 వికెట్లు.. 122 వన్డేల్లో 1524 రన్స్, 173 వికెట్లు.. 33 టీ20ల్లో 147 రన్స్, 31 వికెట్లు తీశాడు.
ఇవి కూడా చదవండి
పాపం ఈ అమ్మాయి.. రోడ్డుపై గుంత ప్రాణం తీసింది..
దేశంలోని విస్కీ అమ్మకాల్లో 58శాతం దక్షిణ భారతంలోనే