Chinese Man Breaks World Record: మెషిన్ కూడా ఇతడిని చూసి అసూయపడుతుందేమో.. జంపింగ్‌లో ప్రపంచ రికార్డు..
ABN , Publish Date - Aug 07 , 2025 | 12:45 PM
జియోలిన్ జంపింగ్ ప్రపంచ రికార్డుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని జియోలిన్ జంపింగ్ స్పీడ్ చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా జియోలిన్ కేవలం 30 సెకెన్ల వ్యవధిలో ఏకంగా 238 జంప్‌లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
చైనాకు (China) చెందిన ఓ వ్యక్తి నమ్మశక్యం కాని రికార్డు సాధించాడు. జపాన్‌లో జరిగిన 2025 ప్రపంచ జంప్-రోప్ ఛాంపియన్‌షిప్ (Jump-Rope Championship)లో రోప్ జంపింగ్ (Rope jumping)లో అనితర సాధ్యమైన రికార్డును నెలకొల్పాడు. దక్షిణ చైనాలోని గ్వాంగ్‌డాంగ్ ప్రావిన్స్ రాజధాని గ్వాంగ్‌జౌ నగరానికి చెందిన సెన్ జియోలిన్ (Cen Xiaolin) ప్రపంచంలోనే అత్యంత వేగవంతమైన జంప్ రోపర్‌గా నిలిచాడు. అతడు కేవలం 30 సెకెన్ల వ్యవధిలో ఏకంగా 238 జంప్‌లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు.
జియోలిన్ జంపింగ్ ప్రపంచ రికార్డుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలోని జియోలిన్ జంపింగ్ స్పీడ్ చూసిన వారందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. తాజాగా జియోలిన్ కేవలం 30 సెకెన్ల వ్యవధిలో ఏకంగా 238 జంప్‌లతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. ఇంతకు ముందు రికార్డు కూడా జియోలిన్ పేరు మీదే ఉంది. అంతేకాదు ఈ విభాగంలో తనే నెలకొల్పిన రికార్డులను మళ్లీ తనే బద్దలుకొట్టుకుంటూ వస్తున్నాడు.
జియోలిన్ 11 సంవత్సరాల వయసులో 2015లో జరిగిన మొదటి ప్రపంచ ఇంటర్-స్కూల్ రోప్ జంపింగ్ ఛాంపియన్‌షిప్‌లో రెండు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు. 30 సెకన్ల సింగిల్ రోప్ స్పీడ్ ఈవెంట్‌లో 220 జంప్‌లు, 3 నిమిషాల సింగిల్ రోప్ ఎండ్యూరెన్స్ ఈవెంట్‌లో 548 జంప్‌లు చేసి రికార్డు నెలకొల్పాడు. అలాగే జియోలిన్ అనేక ఛాంపియన్‌షిప్‌లను గెలుచుకున్నాడు. ఇక, 3-నిమిషాల సింగిల్ రోప్, 30-సెకండ్ సింగిల్ రోప్, 2×30-సెకండ్ డబుల్ అండర్స్, 4×30-సెకండ్ డబుల్ డచ్, 60-సెకండ్ డబుల్ డచ్ ఈవెంట్‌లలో అనేక ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టాడు.
ఇవి కూడా చదవండి..
ధ్రువ్ జురెల్ ఉంటే గెలుపు ఖాయమా? టీమిండియాకు ధ్రువ్ ఉంటే కలిసొస్తోందా..
ఇది క్రీడా పోటీనా..భారత్-పాక్ మ్యాచ్‌పై ప్రియాంక చతుర్వేది ఆగ్రహం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..