Chennai Grandmasters Chess 2025: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ నేటికి వాయిదా
ABN , Publish Date - Aug 07 , 2025 | 02:59 AM
అగ్ని ప్రమాదం కారణంగా చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ఆరంభాన్ని గురువారానికి వాయిదా వేశారు. వాస్తవంగా పోటీలు బుధవారం మొదలు కావాలి. అయితే, టోర్నీ నిర్వహిస్తున్న హయత్ రీజెన్సీ హోటల్‌లో...
చెన్నై: అగ్ని ప్రమాదం కారణంగా చెన్నై గ్రాండ్ మాస్టర్స్ చెస్ టోర్నీ ఆరంభాన్ని గురువారానికి వాయిదా వేశారు. వాస్తవంగా పోటీలు బుధవారం మొదలు కావాలి. అయితే, టోర్నీ నిర్వహిస్తున్న హయత్ రీజెన్సీ హోటల్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్ని ప్రమాదం సంభవించింది. దట్టమైన పొగలు కమ్ముకోవడంతో అర్ధరాత్రి హోటల్‌లో ఉన్న వారిని ఖాళీ చేయించారు. ఆటగాళ్లందరూ సురక్షితంగా ఉన్నారని నిర్వాహకులు తెలిపారు. ఒకరోజు ఆలస్యం కావడంతో.. విశ్రాంతి దినాన్ని షెడ్యూల్ నుంచి తొలగించినట్టు చెప్పారు. తెలుగు గ్రాండ్‌మాస్టర్లు అర్జున్ ఇరిగేసి, ద్రోణవల్లి హారికతోపాటు ప్రముఖ అంతర్జాతీయ ఆటగాళ్లు కూడా ఈ టోర్నీలో పాల్గొంటున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
అవినీతి, ఆశ్రిత పక్షపాతంతోనే ప్రాజెక్ట్ నిర్మాణం: సీఎం రేవంత్ రెడ్డి
Read latest Telangana News And Telugu News