Ind vs NZ: శ్రేయస్ హాఫ్ సెంచరీ.. కోలుకున్న టీమిండియా..!
ABN , Publish Date - Mar 02 , 2025 | 04:51 PM
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్ అర్దశతకంతో ఆదుకోవడంతో టీమిండియా కోలుకుంది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్ (42)తో కలిసి శ్రేయస్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా కోలుకుంది.
మిడిలార్డర్ బ్యాటర్ శ్రేయస్ అయ్యర్ (Shreyas Iyer) అర్దశతకంతో ఆదుకోవడంతో టీమిండియా కోలుకుంది. 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన టీమిండియాను అక్షర్ పటేల్ (42)తో కలిసి శ్రేయస్ ఆదుకున్నాడు. వీరిద్దరూ కలిసి నాలుగో వికెట్‌కు 98 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో టీమిండియా కోలుకుంది. అర్ధ శతకం వైపు దూసుకెళ్తున్న అక్షర్‌ను రచిన్ రవీంద్ర అవుట్ చేశాడు. దీంతో టీమిండియా ప్రస్తుతం 35 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 155 పరుగులు చేసింది. శ్రేయస్ (67 బ్యాటింగ్)తో పాటు కేఎల్ రాహుల్ (13 బ్యాటింగ్) క్రీజులో ఉన్నాడు.
ఛాంపియన్స్ ట్రోఫీ (Champions Trophy)లో భాగంగా జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా ఆరంభంలో తడబడింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో (Ind vs NZ) స్వల్ప స్కోరుకే టాపార్డర్ బ్యాట్స్‌మెన్ పెవిలియన్‌కు చేరుకున్నారు. దుబాయ్ వేదికగా జరుగుతున్న మ్యాచ్‌లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బౌలింగ్ ఎంచుకోవడంతో టీమిండియా బ్యాటింగ్‌కు దిగింది. పిచ్ స్వింగ్‌కు అనుకూలిస్తుండడంతో కివీస్ బౌలర్లు చెలరేగారు. శుభ్‌మన్ గిల్ (2), రోహిత్ శర్మ (15), విరాట్ కోహ్లీ (11) కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. దీంతో టీమిండియా 30 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
ఆ క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్, శ్రేయస్ అయ్యర్ ఆదుకున్నారు. కివీస్ బౌలర్లలో హెన్రీ రెండు వికెట్లు, జేమీసన్ ఒక వికెట్ పడగొట్టారు. గ్రూప్-ఏలో భాగంగా జరుగుతున్న ఈ చివరి లీగ్ మ్యాచ్ సెమీస్‌లో ఏయే జట్లు తలపడబోతున్నాయే తేల్చేస్తుంది. ఈ మ్యాచ్‌లో గెలిచే జట్టు సెమీస్‌లో ఆస్ట్రేలియాతో ఆడుతుంది. ఓడిన జట్టు దక్షిణాఫ్రికాతో సెమీస్ మ్యాచ్ ఆడనుంది. గ్రూప్-ఏ నుంచి బంగ్లాదేశ్, పాకిస్తాన్ జట్లు, గ్రూప్-బి నుంచి అఫ్గానిస్తాన్, ఇంగ్లండ్ జట్లు ఇంటి దారి పట్టాయి.
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..