Share News

చాంపియన్‌ ప్రజ్ఞానంద

ABN , Publish Date - Feb 03 , 2025 | 05:31 AM

టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన టైబ్రేకర్‌లో 2-1తో వరల్డ్‌ చాంపియన్‌ గుకే్‌షను ప్రజ్ఞానంద ఓడించాడు....

చాంపియన్‌ ప్రజ్ఞానంద

టైబ్రేకర్‌లో గుకే్‌షకు షాక్‌

టాటా స్టీల్‌ చెస్‌

వి కాన్‌జీ: టాటా స్టీల్‌ చెస్‌ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్‌ ఆర్‌.ప్రజ్ఞానంద విజేతగా నిలిచాడు. ఆదివారం హోరాహోరీగా సాగిన టైబ్రేకర్‌లో 2-1తో వరల్డ్‌ చాంపియన్‌ గుకే్‌షను ప్రజ్ఞానంద ఓడించాడు. చివరి, 13వ రౌండ్‌లో గ్రాండ్‌మాస్టర్‌ గుకేష్‌, ప్రజ్ఞానంద ఇరువురూ పరాజయం చవిచూశారు. తెలంగాణ గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌..గుకే్‌షకు షాకిస్తే, విన్సెంట్‌ కీమర్‌..ప్రజ్ఞానందకు చెక్‌ పెట్టాడు. దాంతో గుకేష్‌, ప్రజ్ఞానంద చెరో 8.50 పాయింట్లతో సమంగా నిలవడంతో రెండు గేమ్‌ల టైబ్రేకర్‌ నిర్వహించారు. ఇందులో తొలి గేమ్‌లో గుకేష్‌ నెగ్గగా, రెండో గేమ్‌లో ప్రజ్ఞానంద విజయం సాధించాడు. ఫలితంగా విజేతను తేల్చేందుకు సడన్‌ డెత్‌ నిర్వహించాల్సి వచ్చింది. ఇందులో ప్రజ్ఞానంద గెలుపొందాడు.


Ind Vs Eng T20: ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టీ20.. అభిషేక్ శర్మ సరికొత్త రికార్డు

Updated Date - Feb 03 , 2025 | 05:31 AM