Jasprit Bumrah : ఇంగ్లండ్‌తో సిరీస్‌కు బుమ్రా దూరం?
ABN , Publish Date - Jan 07 , 2025 | 04:59 AM
ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలలో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో తను వెన్నునొప్పికి గురైన

న్యూఢిల్లీ: ఇంగ్లండ్‌తో జరిగే పరిమిత ఓవర్ల సిరీ్‌సలలో భారత స్టార్ పేసర్ బుమ్రా ఆడే అవకాశాలు కనిపించడం లేదు. ఆసీస్‌తో జరిగిన చివరి టెస్టులో తను వెన్నునొప్పికి గురైన విషయం తెలిసిందే. ఈనెల 22 నుంచి ఇంగ్లండ్‌తో భారత్ 5 టీ20లు, 3 వన్డేలు ఆడనుంది. వచ్చే నెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీని దృష్టిలో ఉంచుకుని బుమ్రాకు సెలెక్టర్లు విశ్రాంతినిచ్చే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతానికి బుమ్రా గాయం తీవ్రతపై స్పష్టత లేదు. గ్రేడ్ 1 కేటగిరీ అయితే మూడు వారాల విశ్రాంతి సరిపోతుంది. కానీ గ్రేడ్ 2కు ఆరువారాలు, గ్రేడ్ 3కి కనీసం 3నెలలు ఆటకు దూరం కావాల్సి ఉంటుంది. గాయం తీవ్రత తక్కువగా ఉంటే చాంపియన్స్ ట్రోఫీకి ముందు ఫిట్‌నెస్ నిరూపించుకునేందుకు చివరి వన్డేలోనైనా బుమ్రా ఆడే చాన్సుంటుంది.