Brand Boom for Indias Women Cricketers: బ్రాండ్ వాల్యూ రయ్ రయ్
ABN , Publish Date - Nov 05 , 2025 | 05:43 AM
తొలిసారిగా మహిళల వరల్డ్‌క్‌పను సాధించిన భారత క్రికెటర్ల దశ తిరిగింది. ఇప్పటికే ఐసీసీ నజరానాతో పాటు బీసీసీఐ సైతం భారీ స్థాయిలో నగదును ప్రకటించింది. దీనికి తోడు ఆయా సంస్థలు...
ఐసీసీ జట్టులో స్మృతి, దీప్తి, జెమీమా
దుబాయ్: మహిళల వన్డే వరల్డ్‌క్‌పలో విశేషంగా రాణించిన ప్లేయర్లతో టీమ్ ఆఫ్ ద టోర్నమెంట్‌ను ఐసీసీ ప్రకటించింది. ఇందులో ఫైనల్‌కు చేరిన రెండు జట్ల నుంచి ఆరుగురికి చోటు దక్కింది. అలాగే భారత్ నుంచి స్మృతీ మంధాన, దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్ ఎంపికయ్యారు. టీమ్ కెప్టెన్‌గా వోల్వార్ట్‌ను నియమించగా, దక్షిణాఫ్రికా నుంచే కాప్, డిక్లెర్క్ ఉన్నారు. ఇతర క్రికెటర్లలో గార్డ్‌నర్, సదర్లాండ్, అలన కింగ్ (ఆస్ర్టేలియా), సిద్రా నవాజ్ (పాక్ కీపర్), ఎకెల్‌స్టోన్, సివర్ బ్రంట్ (ఇంగ్లండ్) ఉన్నారు.
న్యూఢిల్లీ: తొలిసారిగా మహిళల వరల్డ్‌క్‌పను సాధించిన భారత క్రికెటర్ల దశ తిరిగింది. ఇప్పటికే ఐసీసీ నజరానాతో పాటు బీసీసీఐ సైతం భారీ స్థాయిలో నగదును ప్రకటించింది. దీనికి తోడు ఆయా సంస్థలు, రాష్ర్టాలు కూడా తమ ప్లేయర్లపై కనకవర్షాన్ని కురిపిస్తున్నాయి. అలాగే పలువురు క్రికెటర్లను తమ కంపెనీల ఉత్పత్తుల ప్రచారానికి కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. అటు చాంపియన్ హోదాలో ఆటగాళ్ల బ్రాండ్ విలువ కూడా 25 నుంచి 100 శాతం పెరిగినట్టు సమాచారం. స్మృతీ మంధాన, హర్మన్‌ప్రీత్, జెమీమా, దీప్తి శర్మ, షఫాలీల వెంట ఇప్పుడు కంపెనీలు క్యూ కడుతున్నాయి. అటు సోషల్ మీడియాలోనూ వీరికి ఫాలోవర్ల సంఖ్య ఎక్కువే. బ్రాండ్ ఎండార్స్‌మెంట్ కోసం ఆయా ప్లేయర్ల ఏజెన్సీలను సంప్రదించినప్పుడు వారు రెండింతల నుంచి మూడింతల వరకు రేటు చెబుతున్నారట. అంతేకాకుండా ఇప్పటికే కొనసాగుతున్న సంస్థలు తమ ఒప్పందాలను రెన్యువల్ చేసుకునేందుకు ముందుకు వస్తున్నాయి. ముఖ్యంగా సెమీ్‌సలో సెంచరీతో ఆస్ట్రేలియాను ఓడించిన జెమీమా బ్రాండ్ విలువ ఏకంగా వంద శాతం పెరగడం గమనార్హం. వాస్తవానికి ఆసీ్‌సతో మ్యాచ్ ముగిసినప్పటి నుంచే జెమీమాతో ఒప్పందం కోసం తమకు విపరీతంగా కాల్స్ వస్తున్నట్టు జేఎ్‌సడబ్ల్యూ ఏజెన్సీ పేర్కొంది. ఇప్పుడు ఆమె ఒక్కో బ్రాండ్‌కు రూ.75 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు వసూలు చేస్తోంది. అటు మంధాన ఇప్పటికే 16 బ్రాండ్లతో అందరికన్నా ముందుండగా, ఒక్కో ప్రకటనకు ఆమె రూ.1.5 కోట్ల నుంచి రూ.2 కోట్ల వరకు తీసుకుంటోంది.
ఎవరికి ఎంత మొత్తం..
విశ్వకప్ గెలుచుకున్న భారత మహిళా జట్టు ప్లేయర్లు కోటీశ్వరులు కాబోతున్నారు. విజేతగా నిలిచినందుకు ఐసీసీ దాదాపు రూ.40 కోట్లను ప్రైజ్‌మనీగా అందించింది. దీనికి తోడు బీసీసీఐ సైతం రూ. 51 కోట్లను ఇవ్వనుంది. అంటే రెండు కలిపితే సుమారు రూ. 91 కోట్లు. ఈ మొత్తాన్ని క్రీడాకారిణులు, కోచింగ్ సిబ్బంది (హెడ్ కోచ్, బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ కోచ్‌లు), సహాయక సిబ్బంది (ఫిజియో, ట్రైనర్, ఎనలిస్టు, డాక్టర్, లాజిస్టిక్స్.. తదితరులు)తోపాటు మరికొంతమంది పంచు కోవాల్సివుంటుంది. దీంతో జట్టులో ఒక్కో ప్లేయర్‌కు ఎంత మొత్తం దక్కనుందనే ఆసక్తి వ్యక్తమవుతోంది. కానీ ఈ వివరాలను అధికారికంగా ప్రకటించలేదు. అయితే ఆటగాళ్లు 70 శాతం, కోచింగ్ స్టాఫ్ 10 శాతం, సహాయక సిబ్బంది 7 శాతం అందుకుంటారని చెబుతున్నారు. ఇంకా సెలెక్టర్లు..ఇతరత్రా సిబ్బంది కూడా ఉంటారు. ఇది కాకుండా పేసర్లు రేణుకా సింగ్, క్రాంతి గౌడ్‌లకు వారి రాష్ర్టాల నుంచి రూ. కోటి చొప్పున.. కెప్టెన్ హర్మన్‌ప్రీత్‌కు పంజాబ్ నుంచి రూ.11 లక్షలు, అమన్‌కు రూ.5 లక్షలు దక్కనున్నాయి. ఇక సూరత్ వ్యాపారి ఆటగాళ్లందరికీ వజ్రాల ఆభరణాలను ఇవ్వనున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఢిల్లీ చేరుకున్న క్రికెటర్లు
భారత మహిళా క్రికెటర్లు ముంబైనుంచి మంగళవారం న్యూఢిల్లీ చేరుకున్నారు. హోటల్ వద్ద వారికి అభిమానులు బాణాసంచాతో ఘన స్వాగతం పలికారు. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమవుతారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Laura Wolvaardt: షెఫాలీ బౌలింగ్‌కు షాకయ్యాం: లారా
Shree Charani: ప్రపంచ కప్‌లో కడప బిడ్డ!