Share News

కుర్రాళ్లూ.. సైకిల్‌ వాడండి

ABN , Publish Date - Feb 17 , 2025 | 02:02 AM

ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం సాధ్యమైనంత వరకు సైకిళ్లపై ప్రయాణించడాన్ని అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవ్య యువతకు సూచించారు. ఫిట్‌ ఇండియా ఉద్యమంలో...

కుర్రాళ్లూ.. సైకిల్‌ వాడండి

క్రీడామంత్రి సూచన

ముంబై: ఆరోగ్యం, పర్యావరణ పరిరక్షణ కోసం సాధ్యమైనంత వరకు సైకిళ్లపై ప్రయాణించడాన్ని అలవాటు చేసుకోవాలని కేంద్ర క్రీడాశాఖ మంత్రి మన్సుఖ్‌ మాండవ్య యువతకు సూచించారు. ఫిట్‌ ఇండియా ఉద్యమంలో భాగంగా ఆదివారమిక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ‘ప్రతి ఒక్కరికీ, ముఖ్యంగా యువతకు చెబుతున్నా. వీలైనంత వరకు సైకిళ్లపై ప్రయాణించండి. దీనివల్ల మీరు ఆరోగ్యంగా ఉండడమే గాకుండా పర్యావరణానికి మేలు చేసినవారవుతారు’ అని మాండవ్య తెలిపారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 17 , 2025 | 02:29 AM