ఫ్యామిలీని పక్కనబెట్టండి క్రికెటర్లపై బీసీసీఐ ఆంక్షలు?
ABN , Publish Date - Jan 17 , 2025 | 05:25 AM
ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టును వరుస ఓటములు వెంటాడుతున్నాయి. స్వదేశంలో కివీ్‌సపై వైట్‌వా్‌షతో పాటు ఆసీస్ పర్యటనలో సిరీస్ ఓటమితో అంతటా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి...

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత క్రికెట్ జట్టును వరుస ఓటములు వెంటాడుతున్నాయి. స్వదేశంలో కివీ్‌సపై వైట్‌వా్‌షతో పాటు ఆసీస్ పర్యటనలో సిరీస్ ఓటమితో అంతటా తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. దీంతో జట్టును గాడిన పెట్టేందుకు బీసీసీఐ కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతోంది. దీంట్లో భాగంగా విదేశీ పర్యటనలో క్రికెటర్లు తమ కుటుంబ సభ్యులను వెంట తీసుకురావడంపై ఆంక్షలు విధించనుంది. కోచ్ గంభీర్ ఈ మార్పుల కోసం గట్టిగా పట్టుబట్టినట్టు తెలుస్తోంది. అందుకే కొవిడ్ ముందున్న నిబంధనలను అమల్లోకి తేవాలనుకుంటోంది. ఇప్పటివరకు క్రికెటర్లు సిరీస్ ఆరంభం నుంచి ముగింపు వరకు భార్యా పిల్లలతో గడిపేవారు. కానీ ఇకపై 45 రోజుల పర్యటన ఉంటే కుటుంబ సభ్యులతో రెండు వారాలకంటే ఎక్కువ సమయం గడిపేందుకు ఆటగాళ్లకు అనుమతి ఇవ్వరని సమాచారం.
అలాగే టోర్నీ అంతకన్నా తక్కువ రోజుల్లో ముగిస్తే వారం మాత్రమే పర్మిషన్ ఇస్తారు. అంతేకాకుండా జట్టు ఆటగాళ్ల ప్రయాణాలపైనా ఆంక్షలు ఉండబోతున్నాయి. ఆటగాళ్లంతా ఎవరికి వారు కాకుండా టీమ్ బస్‌లోనే వెళ్లాల్సి ఉంటుంది. ప్రత్యేక వంటవారు, హెయిర్‌డ్రెస్సర్లకు అనుమతి ఉండదు. మరోవైపు దేశవాళీ టోర్నీల్లో ఆడని టీమిండియా ఆటగాళ్ల వేతనాల్లో కూడా కోత విధించాలని ఓ సీనియర్ ప్లేయర్ బోర్డుకు సూచించాడని సమాచారం.