Share News

BCCI: రోహిత్‌ కెప్టెన్సీపై కఠిన నిర్ణయం.. ఫ్యూచర్‌పై తేల్చేయడం ఖాయం

ABN , Publish Date - Mar 08 , 2025 | 03:31 AM

చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత రోహిత్‌ శర్మ కెప్టెన్సీ భవిష్యత్‌ కూడా తేలనుంది.

BCCI: రోహిత్‌ కెప్టెన్సీపై కఠిన నిర్ణయం.. ఫ్యూచర్‌పై తేల్చేయడం ఖాయం
Rohit Sharma

న్యూఢిల్లీ: చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ తర్వాత రోహిత్‌ శర్మ కెప్టెన్సీ భవిష్యత్‌ కూడా తేలనుంది. 2027లో వన్డే వరల్డ్‌క్‌పతో పాటు రాబోయే వరల్డ్‌ టెస్టు చాంపియన్‌షిప్ కోసం భారత జట్టు సన్నద్ధం కావాల్సి ఉంది. అందుకు ఇప్పటి నుంచే వన్డే, టెస్టులకు నూతన సారథిని నియమించాలన్న ఆలోచనలో బీసీసీఐ ఉన్నట్టు సమాచారం. కివీస్‌తో ఫైనల్‌ తర్వాత సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ జాబితాను ప్రకటించాలని బోర్డు భావిస్తోంది. అలాగే గ్రేడ్‌ ఎ+ కాంట్రాక్ట్‌లో మార్పులు జరగనున్నాయి. ఇందులో మూడు ఫార్మాట్లలో అద్భుత ప్రదర్శన కనబర్చిన వారికి చోటుంటుంది. కానీ రోహిత్‌, విరాట్‌, జడేజా టీ20ల నుంచి వైదొలగగా, టెస్టుల్లోనూ రాణించలేదు. దీంతో వీరిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాల్సిందే.

Updated Date - Mar 08 , 2025 | 08:31 AM