BCCI Decision: దేశవాళీ మహిళా క్రికెటర్ల ఫీజులు భారీగా పెంపు
ABN , Publish Date - Dec 23 , 2025 | 05:29 AM
దేశవాళీ పోటీలలో మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంచుతూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డే, బహుళ రోజుల...
న్యూఢిల్లీ: దేశవాళీ పోటీలలో మహిళా క్రికెటర్ల మ్యాచ్ ఫీజులు భారీగా పెంచుతూ బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. ఇకపై సీనియర్ మహిళా క్రికెటర్లు వన్డే, బహుళ రోజుల టోర్నీలలో తుది 11 మంది జట్టులో ఉంటే..రోజుకు రూ. 50 వేలు అందుకుంటారు. ప్రస్తుతం ఇది రూ. 20 వేలుగా ఉంది. రిజర్వ్‌లకు రూ. 25 వేలు (ప్రస్తుతం రూ. 10వేలు) లభిస్తాయి. జాతీయ టీ20 టోర్నీలలో తుది 11 మంది క్రికెటర్లు ఒక్కొక్కరికి రూ. 25వేలు చెల్లిస్తారు. రిజర్వ్‌లకు రూ. 12,500 లభిస్తాయి. అంటే..మహిళా క్రికెటర్లు అన్ని ఫార్మాట్లలో కనుక ఆడితే సీజన్‌కు 12 నుంచి 14 లక్షల వరకు సంపాదిస్తారు. అండర్-23, అండర్-19 క్రికెటర్లకు రోజుకు రూ. 25 వేలు అందుతాయి. రిజర్వ్‌లకు రూ. 12,500 లభిస్తాయి. అంపైర్లు, మ్యాచ్ రెఫరీలకు ఇకపై రోజుకు రూ. 40 వేలు చెల్లిస్తారు. నాకౌట్ మ్యాచ్‌లకు..రోజుకు రూ. 50 నుంచి రూ. 60 వేలు అందుకుంటారు. పెంపు తర్వాత రంజీ ట్రోఫీ లీగ్ పోటీలకు బాధ్యతలు నిర్వర్తించే అంపైర్లకు ఒక్కో మ్యాచ్‌కు రూ. 1.60 లక్షలు లభిస్తాయి. నాకౌట్‌లో మ్యాచ్‌కు రూ. 2.5 లక్షల నుంచి మూడు లక్షల దాకా అందుకుంటారు.
ఇవీ చదవండి:
క్రికెట్‌కు వీడ్కోలు పలికిన స్టార్ ప్లేయర్
ఇప్పటికీ అదే మాట అంటా.. ఆసీస్ ఓ చెత్త జట్టు: స్టువర్ట్ బ్రాడ్