బంగ్లా ఇన్నింగ్స్ గెలుపు
ABN , Publish Date - May 01 , 2025 | 05:11 AM
మెహ్దీహసన్ మిరాజ్ (104, 5/32) సూపర్ షోతో.. జింబాబ్వేతో రెండో, ఆఖరి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో గెలిచింది...
చట్టోగ్రామ్: మెహ్దీహసన్ మిరాజ్ (104, 5/32) సూపర్ షోతో.. జింబాబ్వేతో రెండో, ఆఖరి టెస్ట్‌లో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్ 106 పరుగుల తేడాతో గెలిచింది. మరో రెండు రోజుల ఆట మిగిలుండగానే నెగ్గిన బంగ్లా.. రెండు టెస్ట్‌ల సిరీ్‌సను 1-1తో సమం చేసింది. ఆటకు మూడోరోజైన బుధవారం ఓవర్‌నైట్ స్కోరు 291/7తో తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లా 444 రన్స్‌కు ఆలౌటైంది. జింబాబ్వే తొలిఇన్నింగ్స్ స్కోరు 227కు.. 217 పరుగుల ఆధిక్యం సాధించింది. అనంతరం జింబాబ్వే రెండో ఇన్నింగ్స్‌లో 111 రన్స్‌కే కుప్పకూలింది.
ఇవి కూడా చదవండి..
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి