Share News

రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:23 AM

హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వెటరన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు బెయిల్‌ లభించింది. ఈ కేసు విచారణలో భాగంగా...

రెజ్లర్‌ సుశీల్‌కు బెయిల్‌

న్యూఢిల్లీ: హత్య కేసులో నిందితుడిగా అభియోగాలు ఎదుర్కొంటున్న వెటరన్‌ రెజ్లర్‌ సుశీల్‌ కుమార్‌కు బెయిల్‌ లభించింది. ఈ కేసు విచారణలో భాగంగా మూడేళ్లుగా జైలు జీవితం గడుపుతున్న సుశీల్‌కి ఎట్టకేలకు బెయిల్‌ దొరికింది. ఢిల్లీలోని ఛత్రశాల్‌ స్టేడియంలో రెండు వర్గాల మధ్య జరిగిన కొట్లాటలో గ్రీకో రోమన్‌ రెజ్లర్‌ సాగర్‌ ధనకర్‌ (27) మృతి చెందాడు. సాగర్‌ను సుశీల్‌ వర్గం కొడుతున్న వీడియోలో అతడు కూడా ఉండడంతో పోలీసులు అరెస్టు చేశారు. గత ఏడాది జూలైలో ట్రయల్‌ కోర్టు సుశీల్‌కు బెయిల్‌ను నిరాకరించడం తెలిసిందే. సుశీల్‌తో పాటు మొత్తం 17 మంది ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.


మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 05:23 AM