Share News

బాబర్‌, రిజ్వాన్‌ అవుట్‌

ABN , Publish Date - Mar 05 , 2025 | 05:29 AM

చాంపియన్స్‌ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్‌ అనూహ్యంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో ఆ జట్టులోని కీలక ఆటగాళ్లపై వేటు పడింది. ఏకంగా కెప్టెన్‌...

బాబర్‌, రిజ్వాన్‌ అవుట్‌

సల్మాన్‌కు పాక్‌ టీ20 పగ్గాలు

న్యూజిలాండ్‌తో సిరీస్‌

లాహోర్‌: చాంపియన్స్‌ ట్రోఫీలో ఆతిథ్య పాకిస్థాన్‌ అనూహ్యంగా గ్రూప్‌ దశలోనే నిష్క్రమించడంతో ఆ జట్టులోని కీలక ఆటగాళ్లపై వేటు పడింది. ఏకంగా కెప్టెన్‌ మహ్మద్‌ రిజ్వాన్‌, స్టార్‌ బ్యాటర్‌ బాబర్‌ ఆజమ్‌లను పాక్‌ టీ20 జట్టు నుంచి తొలగించారు. త్వరలో న్యూజిలాండ్‌తో జరిగే ఐదు మ్యాచ్‌ల సిరీ్‌సకు ప్రకటించిన పాక్‌ జట్టులో వీళ్లిద్దరికీ చోటు దక్కలేదు. రిజ్వాన్‌ స్థానంలో జట్టు కెప్టెన్‌గా సల్మాన్‌ అలీ ఆఘాను నియమించారు. ఆల్‌రౌండర్‌ షాబాద్‌ ఖాన్‌ను జట్టులోకి తీసుకోవడంతో పాటు అతనికి వైస్‌ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించారు. అయితే, టీ20 జట్టు కెప్టెన్‌గా, ఆటగాడిగా చోటు కోల్పోయిన రిజ్వాన్‌.. వన్డే సారథ్య బాధ్యతలను నిలబెట్టుకున్నాడు. వైస్‌ కెప్టెన్‌గా సల్మాన్‌ను ఎంపిక చేశారు. బాబర్‌ కూడా వన్డే జట్టులో స్థానం పదిలం చేసుకున్నాడు.


సౌద్‌ షకీల్‌, కమ్రాన్‌ గులామ్‌లకు వన్డే జట్టు నుంచి ఉద్వాసన పలికారు. న్యూజిలాండ్‌ వేదికగా పాక్‌ ఈనెల 16 నుంచి ఐదు టీ20లు, మూడు వన్డేల సిరీ్‌సను ఆడనుంది. కాగా, చాంపియన్స్‌ ట్రోఫీలో విఫలమైనప్పటికీ జట్టు చీఫ్‌ కోచ్‌గా అకిబ్‌ జావెద్‌ను కొనసాగించారు. న్యూజిలాండ్‌ పర్యటనలో చీఫ్‌ కోచ్‌గా అకిబ్‌ ఉంటాడని పాక్‌ క్రికెట్‌ బోర్డు ప్రకటించింది. గతేడాది ఆరు నుంచి ఎనిమిది నెలల్లోపే గిలెస్పీ, కిర్‌స్టెన్‌లు చీఫ్‌ కోచ్‌లుగా రాజీనామా చేయడంతో జావెద్‌ తాత్కాలిక కోచ్‌గా నియమితుడయ్యాడు.

పాక్‌ టీ20 జట్టు

సల్మాన్‌ ఆఘా (కెప్టెన్‌), షాబాద్‌ ఖాన్‌ (వైస్‌ కెప్టెన్‌), అబ్దుల్‌ సమద్‌, అబ్రార్‌ అహ్మద్‌, హారిస్‌ రౌఫ్‌, హసన్‌ నవాజ్‌, జహాన్‌దాద్‌ ఖాన్‌, ఖుష్‌దిల్‌ షా, మహ్మద్‌ అబ్బాస్‌ అఫ్రీది, మహ్మద్‌ అలీ, మహ్మద్‌ హారిస్‌, మహ్మద్‌ ఇర్ఫాన్‌ ఖాన్‌, ఒమర్‌ బిన యూసుఫ్‌, షహీన్‌ షా అఫ్రీది, సుఫ్యాన్‌ ముఖీమ్‌, ఉస్మాన్‌ ఖాన్‌.



మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Mar 05 , 2025 | 05:29 AM