Share News

శ్రీకాంత్‌కు ఆయుష్‌ షాక్‌

ABN , Publish Date - May 09 , 2025 | 01:28 AM

భారత యువ షట్లర్లు ఆయుష్‌ షెట్టి, ఉన్నతి హుడా తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో వారు సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టారు...

శ్రీకాంత్‌కు ఆయుష్‌ షాక్‌

తైపీ: భారత యువ షట్లర్లు ఆయుష్‌ షెట్టి, ఉన్నతి హుడా తైపీ ఓపెన్‌ సూపర్‌ 300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో జోరు కొనసాగిస్తున్నారు. ఈక్రమంలో వారు సింగిల్స్‌ క్వార్టర్‌ఫైనల్లో అడుగు పెట్టారు. గురువారం హోరాహోరీగా జరిగిన పురుషుల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో 20 ఏళ్ల ఆయుష్‌ 21-16, 15-21, 21-17తో సీనియర్‌ ఆటగాడు కిడాంబి శ్రీకాంత్‌కు షాకిచ్చాడు. తొలి రౌండ్‌లో..ఆల్‌ ఇంగ్లండ్‌ చాంపియన్‌షి్‌ప రన్నరప్‌ లీ చియాను కంగుతినిపించిన ఆయు్‌ష..క్వార్టర్స్‌లో ఏడో సీడ్‌ బ్రియాన్‌ యంగ్‌ (కెనడా)తో అమీతుమీ తేల్చుకుంటాడు. మహిళల సింగిల్స్‌ రెండో రౌండ్‌లో ఉన్నతి 21-12, 21-17తో స్థానిక క్రీడాకారిణి లిన్‌ యున్‌పై నెగ్గింది.

ఈ వార్తలు కూడా చదవండి..

Operation Sindoor: జమ్ము టార్గెట్‌గా పాకిస్థాన్‌ డ్రోన్‌ దాడులు

మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - May 09 , 2025 | 01:29 AM