Australia vs West Indies T20 Series : ఆసీస్ క్లీన్‌స్వీప్
ABN , Publish Date - Jul 30 , 2025 | 05:40 AM
వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను పర్యాటక ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం రాత్రి జరిగిన ఐదవ, ఆఖరి టీ20లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో...
ఐదో టీ20లోనూ విండీస్ చిత్తు
సెయింట్ కిట్స్: వెస్టిండీస్‌తో ఐదు టీ20ల సిరీస్‌ను పర్యాటక ఆస్ట్రేలియా 5-0తో క్లీన్‌స్వీప్ చేసింది. సోమవారం రాత్రి జరిగిన ఐదవ, ఆఖరి టీ20లో ఆసీస్ 3 వికెట్ల తేడాతో విండీస్‌ను చిత్తు చేసింది. తొలుత విండీస్ 19.4 ఓవర్లలో 170 పరుగులకు ఆలౌటైంది. హెట్‌మయెర్(52), షెర్ఫెన్ రూథర్‌ఫోర్డ్ (35) మినహా మిగతా బ్యాటర్లు విఫలమయ్యారు. బెన్ డ్వార్షుయిస్ మూడు వికెట్లు పడగొట్టాడు. ఛేదనలో ఆసీస్ 17 ఓవర్లలో 173/7 స్కోరు చేసి గెలిచింది. మిచెల్ ఓవెన్ (37), కామెరూన్ గ్రీన్ (32), టిమ్ డేవిడ్ (30) వేగంగా ఆడారు. అకిల్ హొస్సేన్ 3 వికెట్ల పడగొట్టాడు.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..