Share News

Australia vs South Africa : ఆసీస్‌, దక్షిణాఫ్రికా శుభారంభం

ABN , Publish Date - Jan 19 , 2025 | 05:41 AM

అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ శుభారంభం చేశాయి. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది

Australia vs South Africa : ఆసీస్‌, దక్షిణాఫ్రికా శుభారంభం

అండర్‌-19 టీ20 ప్రపంచ కప్‌

కౌలాలంపూర్‌: అండర్‌-19 మహిళల టీ20 వరల్డ్‌ కప్‌లో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్‌ శుభారంభం చేశాయి. స్కాట్లాండ్‌తో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తొమ్మిది వికెట్లతో నెగ్గింది. తొలుత స్కాట్లాండ్‌ 15.1 ఓవర్లలో 48 పరుగులకే కుప్పకూలగా, లక్ష్యాన్ని ఆసీస్‌ జట్టు 6.4 ఓవర్లలో పూర్తి చేసింది. ఇంకో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 22 పరుగులతో న్యూజిలాండ్‌ను ఓడించింది. మరో మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ జట్టు నేపాల్‌పై నెగ్గింది. ఇంగ్లండ్‌-ఐర్లాండ్‌ మ్యాచ్‌ వర్షంతో అర్ధంతరంగా ముగిసింది. ఇక నైజీరియా-సమోవా, పాకిస్థాన్‌-అమెరికా మ్యాచ్‌లు ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయ్యాయి.

Updated Date - Jan 19 , 2025 | 05:41 AM