Share News

Asia Cup Trophy: గదిలో పెట్టి తాళం వేశాడు

ABN , Publish Date - Oct 11 , 2025 | 05:32 AM

ఆసియాక్‌పలో విజేతగా నిలిచి రెండు వారాలైనప్పటికీ భారత టీ20 జట్టుకు ఇప్పటిదాకా ట్రోఫీ దక్కలేదు. పాక్‌పై ఫైనల్లో గెలిచాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ నుంచి...

Asia Cup Trophy: గదిలో పెట్టి తాళం వేశాడు

ఆసియా‘క్‌ప’పై నఖ్వీ తీరు

దుబాయ్‌: ఆసియాక్‌పలో విజేతగా నిలిచి రెండు వారాలైనప్పటికీ భారత టీ20 జట్టుకు ఇప్పటిదాకా ట్రోఫీ దక్కలేదు. పాక్‌పై ఫైనల్లో గెలిచాక ఆసియా క్రికెట్‌ కౌన్సిల్‌ (ఏసీసీ) చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ నుంచి తాము ఆ ట్రోఫీ అందుకునేది లేదని కెప్టెన్‌ సూర్యకుమార్‌ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. దీంతో నఖ్వీ వేదికపైనుంచే కప్‌ను తీసుకెళ్లిపోయాడు. తాజా సమాచారం ప్రకారం దాన్ని దుబాయ్‌లోని తన ఏసీసీ ప్రధాన కార్యాలయంలో పెట్టి గదికి తాళం వేశాడట. ‘ఇప్పటికీ ట్రోఫీ ఆ ఆఫీ్‌సలోనే ఉంది. తన అనుమతి లేకుండా ఆ ట్రోఫీని ఎట్టి పరిస్థితిలో తీయకూడదని, అలాగే ఎవరికీ ఇవ్వకూడదని మాకు ఆదేశాలున్నాయి. ఒకవేళ ఇవ్వాల్సి వస్తే ఎప్పటికైనా దాన్ని స్వయంగా తానే బీసీసీఐకి కానీ భారత జట్టుకు కానీ ఇస్తానని నఖ్వీ తెలిపాడు’ అని ఏసీసీ వర్గాలు పేర్కొన్నాయి.

ఈ వార్తలు కూడా చదవండి..

పారిశ్రామికవేత్తలని జగన్ అండ్ కో బెదిరిస్తున్నారు.. ఎంపీ రమేశ్ ఫైర్

హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ రాకెట్.. సంచలన విషయాలు వెలుగులోకి..

Updated Date - Oct 11 , 2025 | 05:32 AM