Share News

Asia Cup Trophy: ఆసియా ట్రోఫీ రాబోతోంది

ABN , Publish Date - Nov 09 , 2025 | 06:09 AM

ఆసియాకప్‌ టీ20 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు దాదాపు నెలన్నర రోజులైనా ట్రోఫీ అందలేదు. అయితే ఈ విషయమై దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో...

Asia Cup Trophy: ఆసియా ట్రోఫీ రాబోతోంది

నఖ్వీతో సమావేశమైన బీసీసీఐ కార్యదర్శి

దుబాయ్‌: ఆసియాకప్‌ టీ20 టోర్నీలో చాంపియన్‌గా నిలిచిన టీమిండియాకు దాదాపు నెలన్నర రోజులైనా ట్రోఫీ అందలేదు. అయితే ఈ విషయమై దుబాయ్‌లో జరుగుతున్న ఐసీసీ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో బీసీసీఐ, పీసీబీ చైర్మన్‌ మొహిసిన్‌ నఖ్వీ మధ్య సానులకూలంగా చర్చలు జరిగాయి. త్వరలోనే ట్రోఫీ మనకు అందుతుందన్న విశ్వాసం ఉందని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించాడు. ‘అజెండాలో లేనప్పటికీ సీనియర్‌ ఐసీసీ అధికారుల సమక్షంలో నేను, నఖ్వీ భేటీ అయ్యాం. ఇక ఈ విషయమై ప్రతిష్టంభన తొలగినట్టే’ అని సైకియా తెలిపాడు. సెప్టెంబరు 28న ఆసియాకప్‌ ఫైనల్లో గెలిచిన భారత్‌ ఏసీసీ చీఫ్‌ నఖ్వీ చేతుల మీదుగా ట్రోఫీ అందుకునేందుకు నిరాకరించింది. దీంతో నఖ్వీ కప్‌ను తీసుకెళ్లి తన కార్యాలయంలో భద్రపరిచాడు.

ఇవి కూడా చదవండి

2028 Olympics: భారత్‌, పాక్‌ పోరు లేనట్లేనా..?

ND vs SA Unofficial Test: అదరగొట్టిన ధ్రువ్ జురెల్.. సౌతాఫ్రికా ముందు భారీ టార్గెట్‌

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Nov 09 , 2025 | 06:09 AM