Asia Cup Trophy Controversy: ఐదు బోర్డుల చెంతకు ట్రోఫీ వివాదం
ABN , Publish Date - Oct 01 , 2025 | 05:48 AM
ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రదానం చేయాల్సిన ట్రోఫీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లోనూ...
దుబాయ్: ఆసియా కప్ ఫైనల్లో విజేతగా నిలిచిన భారత జట్టుకు ప్రదానం చేయాల్సిన ట్రోఫీ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. మంగళవారం జరిగిన ఆసియా క్రికెట్ మండలి (ఏసీసీ) వార్షిక సర్వసభ్య సమావేశం (ఏజీఎం)లోనూ ఎలాంటి నిర్ణయం తీసుకోలేక పోయారు. ఈ సమస్య పరిష్కార బాధ్యతలను ఏసీసీలోని ఐదు టెస్ట్ దేశాలకు వదిలేశారు. దీంతో భారత్, పాకిస్థాన్, అప్ఘానిస్థాన్, శ్రీలంక, బంగ్లాదేశ్ బోర్డులు చర్చించి త్వరలో నిర్ణయం తీసుకోనున్నాయి. ఈ వివాదంపై ఐసీసీకి ఫిర్యాదు చేస్తామని బీసీసీఐ ఈపాటికే హెచ్చరించింది. ఏసీసీ చీఫ్‌గా ఉన్న మొహిసిన్ నక్వీ పాకిస్థాన్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా ఉండడంతో.. ఆదివారం జరిగిన ఆసియా కప్ ఫైనల్ గెలిచిన అనంతరం అతడి చేతుల మీదుగా ట్రోఫీని అందుకొనేందుకు భారత్ నిరాకరించింది. దీంతో ట్రోఫీతోపాటు టీమిండియాకు ఇవ్వాల్సిన మెడల్స్‌ను నక్వీ తన హోటల్ రూమ్‌కు తరలించినట్టు ఆరోపణలు వచ్చాయి. కాగా, నక్వీ అధ్యక్షతన జరిగిన ఏసీసీ ఏజీఎంలో బీసీసీఐ ప్రతినిధులుగా రాజీవ్ శుక్లా, ఆశిష్ షేరల్ వర్చువల్‌గా పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి..
శబరిమల అయ్యప్ప స్వామి భక్తులకు శుభవార్త
ఢిల్లీలో భారీ వర్షం, ట్రాఫిక్ ఇబ్బందులు..విమాన సర్వీసులపై ప్రభావం