Asia Cup 2025: యూఏఈలో ఆసియా కప్
ABN , Publish Date - Jul 25 , 2025 | 01:53 AM
ఇండో-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అడ్డంకులు...
న్యూఢిల్లీ: ఇండో-పాక్ హైవోల్టేజ్ మ్యాచ్‌కు మరోసారి రంగం సిద్ధమైంది. బీసీసీఐ ఆధ్వర్యంలో యూఏఈ వేదికగా ఆసియా కప్ టీ20 టోర్నీని నిర్వహించేందుకు ఉన్న అడ్డంకులు తొలగినట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ఏసీసీ) వర్గాలు తెలిపాయి. సెప్టెంబరులో టోర్నీని షెడ్యూల్ చేసే అవకాశాలున్నా.. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఢాకాలో గురువారం జరిగిన ఏసీసీ ఏజీఎకు బీసీసీఐ ఉపాధ్యక్షుడు రాజీవ్ శుక్లా వర్చువల్‌గా హాజరయ్యాడు. ‘యూఏఈలో నిర్వహించే ఆసియా కప్‌నకు బీసీసీఐ ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్ తమ మ్యాచ్‌లన్నీ దుబాయ్‌లో ఆడే అవకాశాలున్నాయి. షెడ్యూల్ విషయంలో చర్చలు జరుగుతున్నాయ’ని ఏసీసీ వర్గాలు తెలిపాయి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి