Share News

Asia Athletics 2025: నిత్య బృందానికి రజతం

ABN , Publish Date - Jun 01 , 2025 | 02:26 AM

అసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో నిత్య గంధె రజత పతకం సాధించి మెరుస్తోంది. భారత్ 24 పతకాలతో రెండో స్థానంలో నిలిచింది.

Asia Athletics 2025: నిత్య బృందానికి రజతం

  • ఆఖరి రోజు ఆరు

  • ఆసియా అథ్లెటిక్స్‌

  • 24 పతకాలతో భారత్‌కు రెండోస్థానం

గుమి: ప్రతిష్ఠాత్మక ఆసియా అథ్లెటిక్స్‌ చాంపియన్‌షి్‌పలో తెలుగమ్మాయి నిత్య గంధె రజత పతకంతో మురిసింది. అయితే మరో తెలుగు అథ్లెట్‌ జ్యోతి యర్రాజి 200 మీటర్ల పరుగులో నిరాశ పరిచింది. ఇక..శనివారం చివరి రోజు భారత్‌ 3 రజతాలు, 3 కాంస్యాలతో మొత్తం ఆరు పతకాలు సొంతం చేసుకుంది. మహిళల 4.100 మీటర్ల రిలేలో హైదరాబాద్‌కు చెందిన నిత్య గంధె, అభినయ, స్నేహ, సర్బాని నందతో కూడిన భారత జట్టు 43.86 సెకన్ల టైమింగ్‌తో రేస్‌ను పూర్తి చేసి రజత పతకం కైవసం చేసుకుంది. మహిళల 200 మీటర్ల పరుగు ఫైనల్లో జ్యోతి యర్రాజి 23.47 సెకన్ల టైమింగ్‌తో ఐదో స్థానంతో సరిపెట్టుకుంది. చాంపియన్‌షి్‌పలో ఇంతకుముందు మహిళల 100 మీటర్ల హర్డిల్స్‌లో జ్యోతి స్వర్ణ పతకం గెలిచిన సంగతి తెలిసిందే. అయితే 200 మీటర్ల లోనూ పోటీపడిన నిత్య 23.90 సెకన్లతో రేస్‌ను ముగించి ఏడో స్థానంలో నిలిచింది. మహిళల ఐదు వేల మీటర్ల పరుగులో పారుల్‌ చౌధురి 15 నిమిషాల 15.53 సెకన్ల టైమింగ్‌తో రజత పతకం చేజిక్కించుకుంది.


ఇప్పటికే 3వేల మీటర్ల స్టీపుల్‌ చేజ్‌లోనూ పారుల్‌ రజతం నెగ్గింది. పురుషుల 200 మీటర్ల పరుగులో అనిమేష్‌, మహిళల 800 మీటర్ల రేసులో పూజ, మహిళల 400 మీటర్ల హర్డిల్స్‌లో విద్య రామ్‌రాజ్‌ కాంస్య పతకాలను భారత్‌ ఖాతాలో చేర్చా రు. జావెలిన్‌ త్రోలో సచిన్‌ యాదవ్‌ 85.16 మీటర్ల దూరంతో రజత పతకం సాధించాడు. పాకిస్థాన్‌కు చెందిన పారిస్‌ ఒలింపిక్స్‌ చాంపియన్‌ అర్షద్‌ నదీమ్‌ (86.40 మీ.) స్వర్ణం నెగ్గాడు. ఇక..ఈ చాంపియన్‌షి్‌పను భారత్‌ మొత్తం 24 పతకాలతో (8 స్వర్ణాలు, 10 రజతాలు, 6 కాంస్యాలు) ఓవరాల్‌గా రెండో స్థానంతో ముగించింది. 19 పసిడి, 9 రజత, 4 కాంస్యా లతో కలిపి మొత్తం 32 పతకాలతో చైనా అగ్రస్థానంలో నిలిచింది. 5 స్వర్ణ, 11 రజత, 12 కాంస్యాలతో ఓవరాల్‌గా 28 పతకాలు సాధించిన జపాన్‌కు రెండోస్థానం దక్కింది.

Updated Date - Jun 01 , 2025 | 02:27 AM