టాప్‌లో అరవింద్
ABN , Publish Date - Mar 07 , 2025 | 06:17 AM
ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద టాప్-2లో కొనసాగుతున్నారు...

ప్రేగ్: ప్రేగ్ అంతర్జాతీయ చెస్ ఫెస్టివల్‌లో భారత గ్రాండ్ మాస్టర్లు అరవింద్ చిదంబరం, ప్రజ్ఞానంద టాప్-2లో కొనసాగుతున్నారు. గురువారం జరిగిన ఎనిమిదో రౌండ్ గేమ్‌లో డేవిడ్ నవారో (చెక్)తో అరవింద్, లియమ్ లి (వియత్నాం)తో గేమ్‌ను ప్రజ్ఞానంద డ్రాగా ముగించారు. దీంతో మొత్తం 8 రౌండ్ల నుంచి అరవింద్ 5.5 పాయింట్లతో అగ్రస్థానంలో నిలవగా.. ప్రజ్ఞానంద 5 పాయింట్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఏడో రౌండ్‌లో అనీష్ గిరి (నెదర్లాండ్స్)పై చిదంబరం నెగ్గగా.. వి యి (చైనా)తో ప్రజ్ఞానంద పాయింట్ పంచుకొన్నాడు.