Share News

ఫైనల్‌ సిందూర్‌ స్పెషల్‌

ABN , Publish Date - May 28 , 2025 | 05:12 AM

తాజా ఐపీఎల్‌ సీజన్‌ను వినూత్నంగా ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా ముగించిన భారత సాయుధ దళాల చీఫ్‌లకు ఆహ్వానం...

ఫైనల్‌ సిందూర్‌ స్పెషల్‌

త్రివిధ దళాధిపతులకు ఆహ్వానం

బీసీసీఐ నిర్ణయం

న్యూఢిల్లీ: తాజా ఐపీఎల్‌ సీజన్‌ను వినూత్నంగా ముగించాలని బీసీసీఐ భావిస్తోంది. దీనిలో భాగంగా ఇటీవలి ఆపరేషన్‌ సిందూర్‌ను విజయవంతంగా ముగించిన భారత సాయుధ దళాల చీఫ్‌లకు ఆహ్వానం పలికింది. అహ్మదాబాద్‌లో జూన్‌ 3వ తేదీన జరిగే ఫైనల్‌ను వీక్షించేందుకు రావాల్సిందిగా ఆర్మీ చీఫ్‌ జనరల్‌ ఉపేంద్ర ద్వివేది, నేవీ చీఫ్‌ అడ్మిరల్‌ దినేశ్‌ త్రిపాఠి, ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ అమర్‌ ప్రీత్‌ సింగ్‌లను కోరింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌లో మన సాయుధ దళాలు ప్రదర్శించిన శౌర్య పరాక్రమాలకు బీసీసీఐ సెల్యూట్‌ చేస్తోంది. అందుకే ఐపీఎల్‌ ముగింపు వేడుకలను సైన్యాన్ని గౌరవించేందుకు అంకితం చేయాలని భావించి త్రివిధ దళాధిపతులతో పాటు ఇతర మిలిటరీ ఉన్నతాధికారులు, సైనికులను ఆహ్వానించాం’ అని బోర్డు కార్యదర్శి దేవజిత్‌ సైకియా వెల్లడించాడు.

ఇవీ చదవండి:

టికెట్ల వ్యవహారం.. సంచలన నివేదిక!

బంతికి 60 లక్షలు.. హీరోను జీరో చేశారు

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 28 , 2025 | 05:12 AM