Ajay Kumar Reddy : అంధుల క్రికెట్‌కు అజయ్ వీడ్కోలు
ABN , Publish Date - Feb 08 , 2025 | 07:01 AM
అర్జున అవార్డు గ్రహీత, భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల అజయ్ స్వస్థలం
ఆఖరి మ్యాచ్‌లో శతకం బాదిన మాజీ కెప్టెన్
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): అర్జున అవార్డు గ్రహీత, భారత అంధుల జట్టు మాజీ కెప్టెన్ ఇల్లూరి అజయ్ కుమార్ రెడ్డి అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. 34 ఏళ్ల అజయ్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పల్నాడుజిల్లా మాచర్ల. అజయ్ క్రికెట్ కెరీర్‌లో వన్డే, టీ20ల్లో కలిపి 101 అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిథ్యం వహించాడు. అజయ్ కెప్టెన్సీలో టీమిండియా 2016 ఆసియా కప్, 2017 టీ20 వరల్డ్‌కప్, 2018 వన్డే ప్రపంచకప్, 2022 టీ20 వరల్డ్‌కప్ సాధించింది. ఇక, 28 రాష్ట్రాలు పాల్గొన్న నగేష్ జాతీయ టీ20 క్రికెట్ టోర్నీలో ఆంధ్ర జట్టు విజేతగా నిలిచింది. శుక్రవారం బెంగళూరు వేదికగా ఢిల్లీతో జరిగిన ఫైనల్లో ఆంధ్ర 67 పరుగుల తేడాతో నెగ్గి, ట్రోఫీ సొంతం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన ఆంధ్ర 20 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 251 పరుగులు చేసింది. అజయ్ 45 బంతుల్లో 104 పరుగులతో తన చివరి మ్యాచ్‌లో సెంచరీ కొట్టి కెరీర్‌ను ఘనంగా ముగించాడు. ఛేదనలో ఢిల్లీ 9 వికెట్లకు 184 పరుగులే చేసి ఓడింది. 19 ఏళ్ల తన సుదీర్ఘ కెరీర్‌లో సహకరించిన కుటుంబ సభ్యులు, సహోద్యోగులు, మిత్రులు, శ్రేయోభిలాషులకు అజయ్ కృతజ్ఞతలు తెలిపాడు.