Share News

ఈ స్పోర్ట్స్‌ వరల్డ్‌ కప్‌నకు అర్జున్‌

ABN , Publish Date - May 22 , 2025 | 03:49 AM

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీకి అర్హత సాధించాడు. 12 మంది క్రీడాకారులు పోటీపడే ఈ వరల్డ్‌ కప్‌ జులై 7 నుంచి ఆగస్టు 24 వరకు సౌదీ అరేబియాలో...

ఈ స్పోర్ట్స్‌ వరల్డ్‌ కప్‌నకు అర్జున్‌

న్యూఢిల్లీ: తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌ కప్‌ చెస్‌ టోర్నీకి అర్హత సాధించాడు. 12 మంది క్రీడాకారులు పోటీపడే ఈ వరల్డ్‌ కప్‌ జులై 7 నుంచి ఆగస్టు 24 వరకు సౌదీ అరేబియాలో జరగనుంది. ఆన్‌లైన్‌ ఈవెంట్‌ అయిన చాంపియన్స్‌ చెస్‌ టూర్‌(సీసీటీ)లో టాప్‌-12లో నిలవడంతో అర్జున్‌ ఈ-స్పోర్ట్స్‌ వరల్డ్‌క్‌పనకు బెర్త్‌ దక్కించుకున్నాడు. దీంతో ఈ మెగా టోర్నీకి ఎంపికైన తొలి భారత ఆటగాడిగా అర్జున్‌ రికార్డుకెక్కాడు. సీసీటీలో భాగంగా ఈ ఏడాది ఆరంభంలో చెసబుల్‌ మాస్టర్స్‌ నిర్వహించగా.. ప్రస్తుతం క్లాసిక్‌ ఈవెంట్‌ జరుగుతోంది. ఇప్పటికే చెసబుల్‌ మాస్టర్స్‌లో సెమీస్‌ చేరిన అర్జున్‌.. తాజాగా చెస్‌ డాట్‌ కామ్‌ క్లాసిక్‌లో ప్లేఆ్‌ఫ్సకు చేరి వరల్డ్‌క్‌ప అర్హతకు కావాల్సిన పాయింట్లను దక్కించుకొన్నాడు. ఈ టోర్నీకి ఇప్పటికే కార్ల్‌సన్‌, నెపోమ్నియాచి, నకమురలాంటి స్టార్లు ఎంపికయ్యారు.

ఇవీ చదవండి:

కటౌట్ ఎత్తుకెళ్లిన కమిన్స్

సాకులు చెబుతున్న ధోని

బీసీసీఐపై ఫ్రాంచైజీలు సీరియస్!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 22 , 2025 | 03:49 AM