అర్జున్ విజయం.టాప్‌లో హంపి
ABN , Publish Date - Jun 02 , 2025 | 03:18 AM
నార్వే చెస్ ఐదో రౌండ్‌లో అర్జున్ ఇరిగేసి గెలవగా, గుకే్‌షకు పరాజయం పాలయ్యాడు. అర్జున్-నకమురా మధ్య క్లాసికల్ గేమ్ డ్రా కావడంతో ఆర్మ్‌గెడాన్ టైబ్రేకర్ నిర్వహించారు...
స్టావంగర్ (నార్వే): నార్వే చెస్ ఐదో రౌండ్‌లో అర్జున్ ఇరిగేసి గెలవగా, గుకే్‌షకు పరాజయం పాలయ్యాడు. అర్జున్-నకమురా మధ్య క్లాసికల్ గేమ్ డ్రా కావడంతో ఆర్మ్‌గెడాన్ టైబ్రేకర్ నిర్వహించారు. అందులో నకమురాకు అర్జున్ షాకిచ్చాడు. వీఈ -గుకేష్ మధ్య గేమ్ కూడా డ్రా కావడంతో టైబ్రేకర్‌కు మళ్లింది. అయితే టైబ్రేకర్‌లో గుకేష్ ఓటమి పాలయ్యాడు. ఈ రౌండ్ తర్వాత అర్జున్ (6), గుకేష్ (5.5) వరుసగా 4, 5 స్థానాల్లో ఉన్నారు. మహిళల్లో హంపి ఐదో రౌండ్ టైబ్రేకర్‌లో లీ టింగ్జీని చిత్తు చేసింది. ప్రస్తుతం హంపి (8.5) టాప్‌లో ఉండ గా, సారా ఖదెమ్‌పై నెగ్గిన వైశాలి (6.5) నాలుగో స్థానానికి ఎగబాకింది.
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి