Share News

గుకేష్‌కు అర్జున్‌ షాక్‌

ABN , Publish Date - May 29 , 2025 | 03:20 AM

నార్వే చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి సంచలనం సృష్టించాడు. రెండో రౌండ్‌లో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌కు...

గుకేష్‌కు అర్జున్‌ షాక్‌

నార్వే చెస్‌

స్లావెంజర్‌ (నార్వే): నార్వే చెస్‌ టోర్నీలో భారత గ్రాండ్‌ మాస్టర్‌ అర్జున్‌ ఇరిగేసి సంచలనం సృష్టించాడు. రెండో రౌండ్‌లో వరల్డ్‌ చాంపియన్‌ గుకేష్‌కు అర్జున్‌ షాకిచ్చాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్‌ 62 ఎత్తుల్లో గుకేష్‌ ఆటకట్టించాడు. కాగా, మొదటి రౌండ్‌లో వరల్డ్‌ నెం.1 కార్ల్‌సన్‌ చేతిలో గుకేష్‌ ఓడాడు. మహిళల టోర్నీ రెండో రౌండ్‌లో అన్నా ముజిచెక్‌ (ఉక్రెయిన్‌) చేతిలో కోనేరు హంపి, లి టింగ్జీ (చైనా) చేతిలో వైశాలి పరాజయం పాలయ్యారు. రెండురౌండ్ల అనంతరం నకమురా, అర్జున్‌ చెరో 4.5 పాయింట్లతో సంయుక్తంగా టాప్‌లో ఉన్నారు.

ఇవీ చదవండి:

హీరోలను మించిన లుక్‌లో రాహుల్!

కోహ్లీతో మైండ్‌గేమ్స్.. ఎవడ్రా వీడు!

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - May 30 , 2025 | 03:01 PM