FIDE World Cup Chess: క్వార్టర్స్‌కు అర్జున్
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:23 AM
తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఫిడే వరల్డ్‌కప్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఐదో రౌండ్లో అర్జున్ 1.5-0.5తో రెండు సార్లు విజేత లెవాన్ అరోనియన్ (అమెరికా)ను చిత్తుచేశాడు. శుక్రవారం తొలిగేమ్‌ను
టైబ్రేక్‌కు హరి
చెస్ వరల్డ్‌కప్
పనాజీ: తెలుగు గ్రాండ్‌మాస్టర్ అర్జున్ ఇరిగేసి ఫిడే వరల్డ్‌కప్ క్వార్టర్స్‌కు దూసుకెళ్లాడు. ఐదో రౌండ్లో అర్జున్ 1.5-0.5తో రెండు సార్లు విజేత లెవాన్ అరోనియన్ (అమెరికా)ను చిత్తుచేశాడు. శుక్రవారం తొలిగేమ్‌ను డ్రాగా ముగించిన అర్జున్.. శనివారం రెండో గేమ్‌లో అరోనియన్‌ను ఓడించాడు. అయితే, మరో తెలుగు ఆటగాడు పెంటేల హరికృష్ణ భవితవ్యం టైబ్రేక్‌కు మళ్లింది. ఐదో రౌండ్లో మెక్సికోకు చెందిన జోస్ మార్టినెజ్‌తో తొలిగేమ్ డ్రా చేసుకున్న హరి.. రెండో గేమ్‌లోనూ ఫలితం రాబట్టలేకపోయాడు. దీంతో స్కోరు 1-1తో సమమవడంతో వీళ్లిద్దరూ ఆదివారం టైబ్రేక్‌లో తలపడనున్నారు.
ఇవి కూడా చదవండి:
ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి