World Chess Cup: టైబ్రేక్‌కు అర్జున్
ABN , Publish Date - Nov 19 , 2025 | 05:04 AM
చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి క్వార్టర్స్ ఫలితం టైబ్రేక్‌కు మళ్లింది. మంగళవారం జరిగిన క్లాసిక్ గేమ్‌లో కూడా ప్రత్యర్థి వి యి (చైనా)తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన...
క్వార్టర్స్ రెండో గేమూ డ్రా ఫ చెస్ వరల్డ్‌కప్
పనాజీ: చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి క్వార్టర్స్ ఫలితం టైబ్రేక్‌కు మళ్లింది. మంగళవారం జరిగిన క్లాసిక్ గేమ్‌లో కూడా ప్రత్యర్థి వి యి (చైనా)తో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. తెల్లపావులతో ఆడిన అర్జున్ 32 ఎత్తుల అనంతరం ప్రత్యర్థితో డ్రాకు అంగీకరించాడు. తొలి గేమ్ కూడా డ్రా కావడంతో అర్జున్, వి యిలు 1-1తో సమంగా నిలిచారు. బుధవారం జరిగే టైబ్రేక్‌లో గెలిచిన వారు సెమీస్‌కు చేరుకొంటారు. జోస్ మార్టినెజ్‌తో జొవోరిక్ షిండరోవ్, సామ్ షెంక్‌లాండ్‌తో ఆండే ఎసిపెంచు కూడా 1-1తో డ్రా చేసుకొన్నారు. కాగా, నోడిర్‌బెక్ 1.5-0.5తో అలెగ్జాండర్ డాన్‌చెంకోపై గెలిచి సెమీస్‌లోకి అడుగుపెట్టాడు.
ఇవి కూడా చదవండి:
IND VS BAN Women’s Series: భారత్-బంగ్లాదేశ్ సిరీస్‌పై కీలక అప్ డేట్
NZ VS WI: న్యూజిలాండ్‌కు భారీ షాక్.. కీలక ప్లేయర్ ఔట్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి