FIDE Chess World Cup: అర్జున్ తొలి గేమ్ డ్రా
ABN , Publish Date - Nov 18 , 2025 | 05:34 AM
ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. సోమవారం జరిగిన రౌండ్-8లో చైనా జీఎం వీ యితో...
పనాజీ: ఫిడే చెస్ వరల్డ్‌క్‌పలో తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి క్వార్టర్ ఫైనల్స్ తొలి గేమ్‌ను డ్రాగా ముగించాడు. సోమవారం జరిగిన రౌండ్-8లో చైనా జీఎం వీ యితో మొదటి క్లాసిక్ గేమ్‌లో అర్జున్ పాయింట్ పంచుకొన్నాడు. నల్లపావులతో ఆడిన అర్జున్ 31 ఎత్తుల అనంతరం డ్రాకు అంగీకరించాడు. జవోకిర్ షిండోవ్ (ఉజ్బెకిస్థాన్)తో జో మార్టినెజ్ (మెక్సికో), సామ్ షెంక్లాండ్ (అమెరికా)తో ఆండే ఎసిపెంకో కూడా పాయింట్ పంచుకొన్నారు. అయితే, అలెగ్జాండర్ డెష్‌చెంకో (జర్మనీ)పై నొడిర్‌బెక్ యాకుబొయేవ్ (ఉజ్బెకిస్థాన్) గెలిచి 1-0 ఆధిక్యంలో నిలిచాడు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా
Yograj Singh: 'చచ్చిపోవాలని ఉంది'.. యువరాజ్ సింగ్ తండ్రి సంచలన కామెంట్స్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి