Share News

Norway Chess Tournament: అర్జున్‌కు మరో ఓటమి

ABN , Publish Date - May 31 , 2025 | 03:15 AM

అర్జున్‌ ఇరిగేసి నార్వే చెస్‌ టోర్నీ నాలుగో రౌండ్‌లో వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో పరాజయం పాలయ్యాడు. గుకేష్‌ మరియు హంపి అగ్రస్థానాల్లో కొనసాగారు.

 Norway Chess Tournament: అర్జున్‌కు మరో ఓటమి

స్టావంజర్‌ (నార్వే): అర్జున్‌ ఇరిగేసి నార్వే చెస్‌ టోర్నీ నాలుగో రౌండ్‌లో వరల్డ్‌ నెం.1 మాగ్నస్‌ కార్ల్‌సన్‌ చేతిలో పరాజయం చవిచూశాడు. గురువారం రాత్రి జరిగిన నాలుగో రౌండ్‌లో 48 ఎత్తులలో అర్జున్‌ని కార్ల్‌సన్‌ ఓడించాడు. అర్జున్‌కిది వరుసగా రెండో పరాజయం. ఇక గుకేష్ -కరువాన మధ్య నాలుగో రౌండ్‌ క్లాసికల్‌ గేమ్‌ డ్రా కావడంతో మ్యాచ్‌ ఆర్మ్‌గెడాన్‌కు మళ్లింది. టైబ్రేకర్‌లో కరువానను గుకేష్‌ చిత్తు చేశాడు. ఈ రౌండ్‌ తర్వాత అర్జున్‌, గుకేష్‌ చెరో 4.5 పాయింట్లతో నాలుగో స్థానంలో కొనసాగుతున్నారు. మహిళల విభాగంలో వరల్డ్‌ చాంపియన్‌ వెన్‌జున్‌-కోనేరు హంపిపై నెగ్గింది. ఈ రౌండ్‌ అనంతరం ముజిచుక్‌తో కలిసి హంపి (7 పాయింట్లు) అగ్ర స్థానంలో నిలిచింది.

Updated Date - May 31 , 2025 | 03:16 AM