Arjun Draws In Round 2: అర్జున్ డ్రా చేశాడు
ABN , Publish Date - Aug 09 , 2025 | 03:29 AM
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీని విజయంతో ప్రారంభించిన తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి..రెండో
చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్
చెన్నై: చెన్నై గ్రాండ్‌మాస్టర్స్ చెస్ టోర్నీని విజయంతో ప్రారంభించిన తెలుగు జీఎం అర్జున్ ఇరిగేసి..రెండో రౌండ్‌ను ఫలితం లేకుండా ముగించాడు. చాలెంజర్స్ విభాగంలో ద్రోణవల్లి హారికకు వరుసగా రెండో రౌండ్‌లోనూ పరాజయం ఎదురైంది. శుక్రవారం జరిగిన మాస్టర్స్ విభాగం రెండో రౌండ్‌లో డచ్ జీఎం జోర్డెన్ వాన్ ఫొరీ్‌స్టతో తలపడిన టాప్‌సీడ్ అర్జున్ 42 ఎత్తులలో డ్రా చేసుకున్నాడు. భారత్‌కు చెందిన ప్రణవ్ నుంచి గట్టి పోటీ ఎదుర్కొన్న విన్సెంట్ కీమర్ (జర్మనీ) 46 ఎత్తుల్లో విజయంతో గట్టెక్కాడు. చాలెంజర్స్ కేటగిరీలో..పన్నీర్ సెల్వమ్ ఇనియన్ చేతిలో హారిక ఓటమి చవిచూసింది.