Yuzvendra Chahal : చాహల్ దంపతులు విడిపోతున్నారా?
ABN , Publish Date - Jan 05 , 2025 | 06:05 AM
టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలుకనున్నారా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే
న్యూఢిల్లీ: టీమిండియా క్రికెటర్ యజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దంపతులు తమ వివాహ బంధానికి ముగింపు పలుకనున్నారా? అంటే.. తాజా పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇప్పటికే సోషల్ మీడియాలో తమ ఖాతాలను అన్‌ఫాలో చేసుకున్న ఈ జంట.. ఇప్పుడు పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను కూడా తొలగించారు. దీంతో ఇద్దరూ విడిపోతున్నారన్న చర్చ ఊపందుకుంది. అంతేకాదు..కొద్ది నెలలుగా వీరు విడివిడిగా ఉంటున్నారని సమాచారం. ప్రముఖ యూట్యూబర్, కొరియోగ్రాఫర్ అయిన ధనశ్రీని చాహల్ 2020లో పెళ్లి చేసుకున్నాడు.